Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “సిల్క్ శారీ” (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మురళీ మోహన్, హీరో శ్రీకాంత్ (Srikanth), శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత కమలేష్ కుమార్- ‘”సిల్క్ శారీ” మూవీతో నిర్మాతగా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మా బ్యానర్లో వరుసగా సినిమాలు రూపొందిస్తా’మన్నారు.
దర్శకుడు టి.నాగేందర్- ‘టైటిల్ నుంచే సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా తెరకెక్కించా’మన్నారు.
హీరో వాసుదేవ్ రావు– ‘హీరో శ్రీకాంత్ నేను ఖడ్గంలో నటించాం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’నన్నారు.
హీరో శ్రీకాంత్- “సిల్క్ శారీ” ట్రైలర్ ఆసక్తిగా ఉంది. వాసుదేవ్ కు సినిమా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. కొత్తగా ప్రయత్నం చేసే ప్రతి సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుంది. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా’నన్నారు.
