తెలుగులో బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు చేసిన ప్రణీత సుభాష్, గతేడాది మేలో బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అప్పుడున్న కోవిడ్ నిబంధనల నేపథ్యంలో చాలా తక్కువ మంది సమక్షంలో ఆమె వివాహం జరిగింది.
ఈరోజు తన భర్త 34వ పుట్టినరోజు సందర్భంగా శుభవార్తను అందరితో పంచుకుంటున్నాను అని తెలిపింది. తాను ప్రెగ్నంట్ అన్న విషయాన్ని అనౌన్స్ చేసింది.
అంతే కాకుండా ప్రెగ్నన్సీ టెస్ట్, స్కాన్ రిపోర్ట్స్ ను కూడా షేర్ చేసింది. షేర్ చేసిన ఫొటోల్లో దంపతులు ఇద్దరూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆమె ఈ న్యూస్ ను తెలియజేయగానే ఆమె ఇండస్ట్రీ స్నేహితులతో పాటు వేలకొద్దీ ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెట్టారు.
ఆఖరుగా హిందీ సినిమా బుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో ప్రణీత కనిపించింది. ప్రస్తుతం బెంగళూరులో తన భర్తతో కలిసి నివాసముంటోంది ప్రణీత.
834806 646971Finding the correct Immigration Solicitor […]below you will find the link to some web sites that we think you ought to visit[…] 673674