బాహుబలి సినిమా ప్రాంతీయ హీరోగా ఉన్న ప్రభాస్ ని ఇంటర్నేషనల్ స్టార్ ని చేసింది. బాహుబలి సినిమాతో ప్రేక్షకుల అంచనాలకు మించేలా అయన స్టామినా ఎదిగింది. ఇప్పుడు ప్రభాస్ అంటే కేవలం టాలీవుడ్ స్టార్ కాదు అయన ఓ ఇంటర్నేషనల్ స్టార్. యస్ .. బాహుబలి కేవలం హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా 17 భాషల్లో విడుదలై సత్తా చాటింది.
ఆ సినిమాలో ప్రభాస్ నటనకు ప్రపంచ నలుమూలల ఉన్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రభాస్ రేంజ్ ఎలా ఉందన్నదానికి తాజా ఉదాహరణ .. అయన తాజాగా నటిస్తున్న సాహో సినిమా థియేట్రికల్ హక్కులను జాపాన్ లో ఓ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకోవడమే ? అవును ఈ సినిమాను జపాన్ ప్రేక్షకులను అందించాలనే ఆలోచనతో ఓ డిస్ట్రిబ్యూటర్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడట.
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియేషన్స్ ఏకంగా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియన్ భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ .
తాజగా జపాన్ లో విడుదల చేసేందుకు ఓ భారీ మొత్తాన్ని కోట్ చేసి అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడట. ఆగస్టు 15న విడుదల అవుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. జిల్ ఫేమ్ రాధ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా దసరాకు విడుదల చేస్తారట.
36498 681319My California Weight Loss diet invariably is an cost effective and versatile staying on your diet tv show created for people who discover themselves planning to drop extra pounds and furthermore ultimately keep a a lot healthier habits. la weight loss 515612
231021 713971I enjoyed reading this a lot I genuinely hope to read far more of your posts in the future, so Ive bookmarked your blog. But I couldnt just bookmark it, oh no.. When I see quality websites like this one, I like to share it with others So Ive produced a backlink to your site (from 452986