Switch to English

సినిమా రివ్యూ: మజిలీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

నటీనటులు : నాగ చైతన్య, సమంత, దివ్యంకా కౌశిక్, రావు రమేష్, పోసాని, సుబ్బరాజు తదితరులు
సంగీతం : గోపిసుందర్
కెమెరా : విష్ణు శర్మ
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది

అక్కినేని నాగ చైతన్య, సమంత లు కలిసి పెళ్ళికి ముందు మూడు సినిమాలు చేసారు. ఈ సినిమాల ప్రయాణంలో వారి మధ్య ప్రేమాయణం మొదలై పెళ్లి వరకు వచ్చారు. ఈ జోడి పెళ్లి తరువాత నటిస్తున్న మొదటి సినిమా కావడంతో మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు పెళ్లి తరువాత కాబట్టి ఆ ఆసక్తి ఇంకా ఎక్కువైంది. పైగా పెళ్లి తరువాత సరైన కథను ఎంపిక చేసుకుని నటించిన చిత్రమే మజిలీ. నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమ మజిలీ ఎక్కడికి వెళ్ళింది ? అన్న వివరాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

జీవితంలో అన్ని రకాలుగా ( లవ్ , కెరీర్ ) ఫెయిల్ అయిన యువకుడు పూర్ణ ( నాగ చైతన్య ) ఎలాంటి బాధ్యత లేకుండా తన గతాన్ని తలచుకుంటూ తాగుబోతుగా మారుతాడు. అతన్ని పెళ్లి చేసుకున్న శ్రావణి ( సమంత ) అతను ఎలా ఉన్న పరవాలేదు నా పక్కన ఉంటే చాలు అనుకునే భార్య. పూర్ణ ఎలాంటి గొడవలు రేపిన, ఏమి చేసినా సరే భర్తకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరి పెళ్లయింది కానీ పూర్ణ జీవితంలోకి ఇంకా శ్రావణి ప్రవేశించలేదు. ఇద్దరి మధ్య చాలా దూరం ఉంటుంది. ఆ తరువాత అనుకోని నాటకీయ పరిణామాల మధ్య మీరా అనే పాప వీరి జీవితంలోకి వస్తుంది. ఆ పాప వారి లైఫ్ లోకి రావడం వల్ల వారి జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ? అసలు ఇన్నాళ్లు జీవితాన్ని పోగొట్టుకున్న పూర్ణ గతం ఏమిటి ? అసలు ఈ పాప రాకతో అతను మారాడా ? ఇంతకీ ఈ పాప ఎవరు ? ఇన్నాళ్లు భార్యను దూరం పెట్టిన పూర్ణ తన భార్య మనసు గెలుచుకున్నాడా ? అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

హ్యూమన్ ఎమోషన్స్ కు సంబందించిన సినిమా కాబట్టి నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుండాలి .. లేదంటే అంతే సంగతులు .. ఈ విషయంలో ఇందులో నటించిన అందరు బాగా చేసారు. ముఖ్యంగా నాగ చైతన్య నటన సినిమాకే హైలెట్. అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పక తప్పదు. లవ్ ఫెయిల్ అయిన యువకుడిగా, జీవితంలో అన్ని కోల్పోయిన వ్యక్తిగా ,తాగుబోతుగా చక్కగా నటించాడు. ముఖ్యంగా పూర్ణ పాత్రలో జీవించాడు. ఇక సమంత గురించి కొత్తగా చెప్పేది ఏమిలేదు. శ్రావణి పాత్రలో అదరగొట్టింది. భర్త అంటే అమితంగా ప్రేమించే భార్యగా మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, ఎమోషన్, పెయిన్ లాంటి అంశాలను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. దాంతో పాటు మధ్యతరగతి జీవితాల నేపథ్యంలో సాగిన ఈ కథ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. హీరో తండ్రి పాత్రలో రావు రమేష్ సూపర్బ్. ఇక హీరోయిన్ తండ్రి గా తన కూతురు జీవితంకోసం ఆరాటపడే తండ్రి పాత్రలో పోసాని నటన చక్కగా ఉండి అక్కడక్కడా నవ్వులు కూడా పూయిస్తాయి. మరో హీరోయిన్ దివ్యంక కౌశిక్ తన నటనతో ఆకట్టుకుంది. చాలా అందంగా కనిపించి ప్రేక్షకులను కట్టిపడేసింది. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేశారు.

టెక్నీకల్ హైలెట్స్ :

ఇలాంటి ఎమోషనల్ సినిమాలకు రీ రికార్డింగ్ ప్రాణం పోస్తుంది. ఆ విషయంలో థమన్ తన ఆర్ ఆర్ తో సినిమాను ఓ మెట్టు పైనే నిలబెట్టాడు. ఇక గోపిసుందర్ ఇచ్చిన పాటలు సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకునేలా ఉన్నాయి. విష్ణు శర్మ ఫొటోగ్రఫీ బాగుంది. వైజాగ్ అందాలని చక్కగా చూపించాడు. కథకు అనుగుణంగా విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఇక ప్రవీణ్ పూడి ఎడిటింగ్ గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు . చక్కని ప్రతిభ కనబరిచాడు. అయితే కథనం కాస్త నెమ్మదిగా సాగడం కాస్త మైనస్ గా అనిపిస్తుంది. అలా కాకుండా ఇంకా తన కత్తెరకు పని చెబితే బాగుండేది. భర్తను ప్రేమించే భార్య, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేని భర్త లాంటి అంశాలతో కథను అల్లుకున్న దర్శకుడు ఫీల్ గుడ్ కథను చెప్పాడు . కానీ మొదటి భాగంలో ఉన్న వేగం రెండో భాగం వచ్చేసరికి తగ్గింది. పైగా కథ విషయంలో కొత్త కథ కాకున్నప్పటికీ సరికొత్త కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే వేగం తగ్గి అక్కడక్కడా బోర్ కొట్టేస్తుంది. ప్రేమించిన అమ్మాయి పేరు పెళ్లి కార్డులో ఉండదురా లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

విశ్లేషణ :

జీవితంలో లవ్, కెరీర్ లో ఫెయిల్ అయిన ఓ యువకుడి జీవితంలోకి ప్రవేశించిన మరో అమ్మాయి .. తన భర్త లోని ఎమోషన్ ని అర్థం చేసుకున్న భార్య కథతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడి తెరకెక్కించిన విధానం సూపర్. మొత్తానికి చైతు కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పాలి.

ట్యాగ్ లైన్ : ఎమోషనల్ జర్నీ

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...