సోషల్ మీడియా లో సెలెబ్రిటీస్ కి సాధారంగానే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత కి ఇంస్టాగ్రామ్ లో దాదాపు 10 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల విడుదలై మంచి కలెక్షన్ ల తో దూసుకుపోతున్న మహర్షి సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ ని మహేష్ బాబు సన్నిహితుల తో కలిసి జరుపుకున్నారు.
“సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్ మూవీ మహర్షి. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. వాట్ ఏ నైట్” అంటూ ఆ సెలెబ్రేషన్స్ లో భాగంగా దిగిన ఒక ఫోటో ని నమ్రత తన ఇంస్టాగ్రామ్ లో మహేష్ అభిమానుల కోసం పోస్ట్ చేసింది. ఆ ఫోటో లో నమ్రత మేక్ అప్ లాంటివి ఏమి వేసుకోకుండా ఫోటో లో సాధారణంగా ఉంది. దీనితో ఆ ఫోటో కింది ఆమె లుక్స్ పైన చాలా ట్రోల్ కామెంట్లు వచ్చాయి .
అందులో ఒక ఫాలోవర్ ‘నమ్రత నువ్వెందుకు కొంచెం అయినా మేకప్ వేసుకోవు. ఏదైనా ఫోబియాతో బాధ పడుతున్నావా లేదా డిప్రెషన్‌లో ఉన్నావా’ అని ట్రోల్ చేశాడు.ఆ కామెంట్ కి నమ్రత తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చింది. గౌరవ్ మేకప్ వేసుకున్న మహిళలనే నువ్వు ప్రేమిస్తావనుకుంటా ఇకపై ఆలోచనా సరళికి సరిపోయే వాళ్లనే ఫాలో అవ్వు సరేనా, అలా అయితేనే ఇలాంటివి చూడకుండా ఉండగలవు.. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిపోవచ్చు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇది అంటూ అతని కామెంట్ కి బదులిచ్చింది.