సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీని స్థాపించి, రాజకీయంగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పనిచేసినప్పుడూ అదే పరిస్థితి. అయితే, ఇప్పుడా విమర్శల స్థాయి మరింత దిగజారింది. అయితే, ఈ విమర్శలేవీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి వున్న గౌరవాన్ని తగ్గించలేవు. ఎవరైనా పవన్ కళ్యాణ్‌ని విమర్శించి, తమ స్థాయిని పెంచుకోవాలంటే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఇక, అసలు విషయానికొస్తే, పవన్ కళ్యాణ్‌కి గుప్త దానాలు కొత్త కాదు. ఎంతోమందికి ఆయన ఆర్థిక సహాయం అందిస్తుంటారు. సాయం పొందినవారు, ఎప్పుడో ఏదో సందర్భంలో చెబితే తప్ప, పవన్ చేసిన సాయం గురించి బయటకు వచ్చే అవకాశమే వుండదు. అలాంటి పవన్ కళ్యాణ్, సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయల విరాళాన్ని కొన్నాళ్ళ క్రితం ప్రకటించారు.. మాటకు కట్టుబడి నేడు, ఆ విరాళాన్ని ‘కేంద్రీయ సైనిక్ బోర్డ్’కి అందించారు. ఢిల్లీలో ఈ మేరకు పవన్ కళ్యాణ్, విరాళం మొత్తాన్ని అధికారులకు అందించడం గమనార్హం.
‘సైనికా.. నీకు సలాం..’ అంటూ పవన్ కళ్యాణ్‌కి సెల్యూట్ చేస్తున్నారిప్పుడు చాలామంది. సహజంగానే పవన్ కళ్యాణ్‌ని ద్వేషించే ఓ బృందం ఈ వ్యవహారంపై విమర్శలు కొనసాగిస్తోందనుకోండి.. అది వేరే విషయం. పదవుల్ని అడ్డంపెట్టుకుని దోచుకునే రాజకీయ నాయకులకీ, పవన్ కళ్యాణ్‌కీ చాలా తేడా వుంది.
ఎవరైతే రాజకీయాల్లోకి సంపాదన కోసం వస్తారో, అలాంటోళ్ళని ఆదర్శంగా తీసుకునే కొందరికి, పవన్ కళ్యాణ్ అంటే గిట్టకపోవడం సహజమే. జనం సొమ్ముతో, జనానికే సంక్షేమ పథకాలు పేరుతో ‘ఆఫర్లు’ ప్రకటిస్తూ, వాటికి తమ పేర్లను పెట్టుకునే రాజకీయ నాయకులెక్కడ.? తన స్వార్జితాన్ని.. నిస్వార్ధంగా సైనిక సంక్షేమానికి అందించిన పవన్ కళ్యాణ్ ఎక్కడ.? ఔను, పవన్ కళ్యాణ్ అందుకే అంత ప్రత్యేకం.
61975 571329quite nice post, i certainly adore this website, keep on it 509894
624673 454101As soon as I identified this internet internet site I went on reddit to share some with the really like with them. 832974
553001 620285I like this internet website very significantly, Its a genuinely nice post to read and get information . 6739