పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే కొత్త సినిమా ప్రారంభమైంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈరోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా ప్రారంభోత్సవం జరిగింది. పవన్ కల్యాణ్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. చిత్రానికి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ (OG) అనే పేరు ప్రచారంలో ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.
సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే పనులు మొదలెట్టేశాం అని తమన్ దర్శకుడు సుజిత్ తో దిగిన ఫోటో పోస్ట్ చేశారు. వకీల్ సాబ్, బీమ్లా నాయక్ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సినిమా ఇది. కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, కె.ఎల్.నారాయణ, కోన వెంకట్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.