Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపిస్తేనే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. చాలా సాధారణంగా నుంచున్నా అది స్టిల్ అయిపోతుంది. వకీల్ సాబ్ షూటింగ్ లో పవన్ నడుస్తూ వెళ్తున్న ఓ పిక్ లీకై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. అటువంటి బాడీ లాంగ్వేజ్ పవన్ కు మాత్రమే సొంతం. ఇప్పుడటువంటి సంచలనమే మళ్లీ సోషల్ మీడియాలో జరుగుతోంది. సుజీత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘ఓజీ’ (OG) షూటింగ్ గ్యాప్ లోనిదీ స్టిల్.
అయితే.. ఈసారి దర్శకుడు సుజీత్ కలిసి భుజం మీద చేయి వేసిన పిక్.. అది కూడా వెనుక నుంచి ఉన్న స్టిల్. దీనిని సుజీత్ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేశాయి. అసలే.. ఎన్నికల హడావిడిలో ఉన్నారు పవన్. దీంతో భారీ బజ్ క్రియేట్ అయిన ‘ఓజీ’ నుంచి స్టిల్ రావడమే వారి ఉత్సాహానికి కారణం. పవన్ కు అచ్చొచ్చిన అత్తారింటికి దారేది రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27న ఓజీ విడుదల కాబోతోంది.