Anushka : అనుష్క హీరోయిన్ గా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ ఇటీవలే ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా చాలా కాలంగా బ్రేక్ తీసుకుని సైలెంట్ గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇప్పటికే షూటింగ్ కు రెడీ అయ్యింది. గతంలో వీరిద్దరి కాంబోలో వేదం సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
హరిహర వీరమల్లు సినిమా మధ్య లో వదిలేసి దర్శకుడు క్రిష్ ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా కోసం శీలావతి అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించారు అంటూ వార్తలు వస్తున్నాయి.
అనుష్క కోసం ఓ మంచి టైటిల్ ను ఖరారు చేసిన దర్శకుడు క్రిష్ ఇదే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అనుష్క తో మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా తీస్తే కచ్చింగా స్టార్ హీరోల రేంజ్ లో వందల కోట్ల వసూళ్లు దక్కించుకోవడం ఖాయం. మరి క్రిష్ ఏం చేస్తాడు అనేది చూడాలి.