Switch to English

సీక్వెల్‌పై ఆసక్తిగా ఉన్న పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు ప్రారంభం అయ్యాయి. నాల్గవ సినిమాను త్రివిక్రమ్‌తో చేయబోతున్నాడు. ఇక అయిదవ సినిమా గురించిన చర్చలు కూడా ప్రారంభం అయినట్లుగా సమాచారం అందుతోంది. గోపాల గోపాల చిత్రంకు సీక్వెల్‌ను చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. వెంకటేష్‌ మరియు పవన్‌లు కలిసి నటించిన గోపాల గోపాల సినిమా యావరేజ్‌గా నిలిచింది.

హిందీ ఓ మైగాడ్‌ చిత్రానికి రీమేక్‌గా గోపాల గోపాల చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ను చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన కథ చర్చలు కూడా జరుగుతున్నాయట. పవన్‌ కథ బాగా వస్తే తప్పకుండా చేద్దాం అన్నట్లుగా ఆసక్తిని కనబర్చాడట. దాంతో దర్శకుడు డాలీ ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీ అయినట్లుగా సమాచారం అందుతోంది.

వచ్చే ఏడాది వరకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేయాల్సిందిగా డాలీకి పవన్‌ సూచించాడట. అప్పటి వరకు వెంకటేష్‌ కూడా తాను కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేస్తాడని సమాచారం అందుతోంది. మొత్తానికి గోపాల గోపాల చిత్రం సీక్వెల్‌ అంటే పవన్‌ ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగి పోతున్నాయి. పవన్‌ కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించాడు. కనుక మరోసారి పవన్‌ మెప్పించడం ఖాయం అంటూ వారు చాలా నమ్మకంగా ఉన్నారు. మరి వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చేనా చూడాలి.

సినిమా

ఎక్స్ క్లూజివ్: రవితేజ ‘క్రాక్’ ఓటిటి రిలీజ్ వార్తలన్నీ పుకార్లే.!

థియేటర్లు నాలుగు నెలలుగా మూతపడే ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకు కూడా ఓపెన్‌ అయ్యేది నమ్మకం తక్కువే. ఆ తర్వాత అయినా ఓపెన్‌...

బాలీవుడ్‌ మరో స్టార్‌ కన్నుమూత

బాలీవుడ్‌ లో వరుసగా జరుగుతున్న సంఘటలు సినీ ప్రేక్షకులకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కరోనా బారిన పడటంతో పాటు సుశాంత్‌ తో...

ఎక్స్ క్లూజివ్: ఊహించని డైరెక్టర్ తో అల్లు అర్జున్ పొలిటికల్ థ్రిల్లర్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. క్లాస్ నుంచి కంప్లీట్ మాస్ లుక్ లోకి మారి...

షార్ట్ ఫిలింని కాస్తా మినీ మూవీగా మార్చేసిన రెజీనా.!

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ రెజీనా. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ...

సినిమా అవకాశమంటూ ఘరానా మోసం.. డబ్బులు వసూలు చేసి ఆపై..

సినిమా అంటే ఇష్టం అందరికీ ఉంటుంది. సినిమాల్లో నటించాలనే వ్యామోహం ఉంటుంది మరికొందరికి. ఇటువంటి వారిని సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలు గతంలో...

రాజకీయం

రాజస్థాన్ రగడ: పైలట్ దారెటు?

రాజస్థాన్ లో రాజకీయ రగడ మరింత ముదిరింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కొనసాగుతున్న విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇరువురూ తమ తమ బల ప్రదర్శనలు ఏర్పాటు...

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాళ్‌ హెమటాబాద్‌ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రాయ్‌ తన స్వగ్రామంలో తన ఇంటికి సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆయన్ను చంపేసి ఆ తర్వాత ఉరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లుగా...

9 ఏళ్ల తర్వాత సుప్రీంలో పద్మనాభస్వామి ఆలయ కేసు తీర్పు

దేశంలోని అత్యంత సంపద ఉన్న దేవాలయంగా కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి వారి ఆలయం నిలిచిన విషయం తెల్సిందే. ట్రావెన్‌కోర్‌ రాజ వంశానికి చెందిన రాజులు ఈ భారీ సంపదను దాచారు. పద్మనాభస్వామి వారి...

పార్టీ పేరు రగడ: వైఎస్సార్సీపీకి నోటీసులు.!

ఇకపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనీ, వైఎస్సార్సీపీ అనీ పిలవడానికి వీల్లేదా.? ఏమో, ముందు ముందు ఆ పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా అయితే ఇప్పటిదాకా...

నిండా ముంచేసిన ముద్రగడ.. తెరవెనుక వున్నదెవరు.?

కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్‌ ఈనాటిది కాదు. నిజానికి, కాపు సామాజిక వర్గం కొత్తగా రిజర్వేషన్లు కోరడంలేదు. చాలా ఏళ్ళ క్రితం తమకున్న బీసీ-రిజర్వేషన్‌ని తిరిగి పునరుద్ధరించాలని మాత్రమే కోరుతోంది....

ఎక్కువ చదివినవి

చైతూ ఆ రెంటిలో ఏది ముందు?

నాగచైతన్య హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్‌ స్టోరీ’ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. సమ్మర్‌లో విడుదల అవ్వాల్సిన లవ్‌ స్టోరీ కాస్త ఈ ఏడాదిలో విడుదల అయ్యేది లేనిది క్లారిటీ...

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్: ‘పితాని’ ముందస్తు జాగ్రత్త.!

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్ కి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో ఏం జరిగిందో తలచుకుని ఒకింత కంగారుపడుతున్నట్టున్నారు టీడీపీ నేత పితాని సత్యనారాయణ. ఈ కేసులో తన కుమారుడిపైనా ఆరోపణలు రావడంతో,...

లాక్‌ డౌన్‌లో వెయిట్‌ పెరిగిన ప్రభాస్‌

టాలీవుడ్‌లో స్టార్‌ హీరో ప్రభాస్‌ సాహో చిత్రం తర్వాత రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ లాక్‌ డౌన్‌ కారణంగా నాలుగు నెలలుగా ఆగిపోయింది. ఈ...

వైఎస్సార్‌ జయంతి: రాజన్నా నిను మరువలేము ఏనాటికీ.!

రాజకీయాల్ని పక్కన పెడితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ముఖ్యమంత్రిగా ఆయన అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు అలాంటివి. సంక్షేమ పథకాలనగానే ముందుగా అందరికీ ‘ఓటు బ్యాంకు...

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో పాల్గొన్న మామ – కోడలు.!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు...