Switch to English

క్రాక్ మూవీ టీజర్ : మాస్ మహారాజా ఫ్యాన్స్ కు పెర్ఫెక్ట్ సినిమా

మాస్ మహారాజా రవితేజ నటించిన లాస్ట్ నాలుగు సినిమాలు దారుణమైన డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెల్సిందే. ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో రవితేజ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. అయితే రవితేజ మాత్రం సినిమాల విషయంలో ఎక్కడా స్పీడ్ తగ్గించట్లేదు. తన దూకుడును కొనసాగిస్తున్నాడు.

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టిన తన నెక్స్ట్ సినిమా క్రాక్ సినిమా టీజర్ మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు విడుదలైంది. ఈ మధ్యనే షూటింగ్ మొదలుపెట్టిన సినిమాకు అప్పుడే టీజర్ వదలడం అంటే మాములు విషయం కాదు. క్రాక్ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా ఒంగోలులో సీరియల్ మర్డర్ ల బ్యాక్ డ్రాప్ లో సినిమాను తీస్తున్నట్లు అర్ధమవుతోంది.

క్రాక్ టీజర్ లో రవితేజ ఆకట్టుకుంటాడు. అతని లుక్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఇంప్రెస్ చేస్తాయి. అలాగే టీజర్ లో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. సముద్రఖని ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. శృతి హాసన్ కథానాయిక. టీజర్ లో సినిమాటోగ్రాఫి మెయిన్ హైలైట్ గా కనిపిస్తోంది. అలాగే ఎస్ ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. మే 8న ఈ చిత్రం విడుదల. కాబోతోంది మరి ఈ సినిమాతోనైనా రవితేజ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

సినిమా

కేజీఎఫ్‌ 2 గురించి రెండు బ్యాడ్‌ న్యూస్‌

కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ కేజీఎఫ్‌ కు ప్రస్తుతం సీక్వెల్‌గా కేజీఎఫ్‌ 2ను చిత్రీకరిస్తున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న...

ఆచార్యలో చరణ్‌.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన చిరు

చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఒక కీలక పాత్ర ఉంటుందని ఆ పాత్రను మహేష్‌ బాబు లేదా రామ్‌ చరణ్‌ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ఏదో...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీంకు 5 కోట్ల ఫైన్‌ వేసిన ఆలియా?

 టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్లాన్‌ వేస్తే దాన్ని అచ్చు గుద్దినట్లుగా పొల్లు పోకుంటా మొదటి నుండి చివరి వరకు ఎగ్జిక్యూట్‌ చేస్తాడనే విషయం అందరికి తెల్సిందే....

ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ చేస్తున్న చరణ్‌

మెగా హీరో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రలో...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి...

రాజకీయం

జనసేనాని హుందాతనం.. వైఎస్సార్సీపీ వెకిలితనం.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో వుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది నిస్సిగ్గుగా....

కరోనాని చంపే జెల్ ని కనుగొన్న బాంబే ఐఐటి.!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది వాక్సిన్లు తయారీలో నిమగ్నమై ఉండగా.. మరికొంత మంది దీనిని నిరోధించే ఔషధం కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. వాక్సిన్...

కరోనా ఎఫెక్ట్‌: ప్రపంచం చాలా చాలా మారిపోవాల్సిందే.!

‘ఇకపై ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ ఇదీ నిపుణులు చెబుతున్న మాట కరోనా వైరస్‌ గురించి. ప్రపంచం చాలా మారాలి. చాలా చాలా మార్పులు చోటు చేసుకోవాలి. అయితే, అవన్నీ మనుషుల అలవాట్ల...

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని...

సోనియా ఐడియా.. మీడియాకు సంకటమే

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి, కరోనాపై పోరుకు అవసరమైన నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన సూచనలు మీడియాకు సంకటంగా మారాయి....

ఎక్కువ చదివినవి

స్టార్స్‌కు మానవత్వం లేదా అంటూ రోజా భర్త సంచలన కామెంట్స్‌

లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా పరిశ్రమ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌ సినీ కార్మికుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ ఏర్పాటు చేసి సాయం చేస్తున్న...

మహేష్ యువ దర్శకులపై ఆసక్తికి ఇదే కారణమా?

సూపర్ స్టార్ మహేష్ బాబును దర్శకుల హీరో అంటుంటారు. ఇప్పుడు కాదు ఇది మహేష్ కెరీర్ ఆరంభం నుండి ఉంది. ఒక్కసారి కథ లాక్ అయిపోయాక దర్శకుడు ఏది చెబితే అది చేసుకుంటూ...

కరోనాతో బుల్లి తెరపై రికార్డుల మోత

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మొత్తం సినిమా థియేటర్లను బంద్‌ చేశారు. ఈ స్థాయిలో థియేటర్లను బంద్‌ చేయడం గతంలో ఎప్పుడు...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కాస్ట్‌ కట్టింగ్‌ తప్పదా?

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు. ఈగతో సినిమా తీసినా కూడా దానికి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఘనత రాజమౌళికి ఉంది. బాహుబలిని ఏ స్థాయి బడ్జెట్‌తో...

‘కరోనా’ కక్కుర్తిలో చైనాకి సాటెవ్వరు.?

కరోనా తొలుత వెలుగు చూసింది చైనాలో. అందుకే దీన్ని కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) అనడం కంటే, చైనా వైరస్‌ అనడం సబబు అని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. చైనాలో సుమారు 80...