Switch to English

వరల్డ్‌ పవనిజం డే.. అసలేంటీ పవర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

పవన్‌ కళ్యాణ్‌.. ఆ పేరులోనే ఏదో ‘పవర్‌’ వుంది. ఓ సినీ నటుడి మీద అభిమానాన్ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్ళి, దాన్ని ఓ ‘ఇజం’గా భావించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ‘ఎవరీ అబ్బాయి..’ అంటూ 23 ఏళ్ళ క్రితం ఓ వాల్‌ పోస్టర్‌ కన్పిస్తే.. ఎవరబ్బా.? అని అంతా ఆశ్చర్యపోయారు. ‘ఈ అబ్బాయే మన కళ్యాణ్‌..’ అంటూ ఆ తర్వాత అసలు విషయాన్ని రివీల్‌ చేశారు. ఆ అబ్బాయే, బాక్సాఫీస్‌ ‘పవర్‌’గా మారతాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు.

వెండి తెరపై మెరుపులా కదులుతూ యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో సత్తా చాటినా, తన కళ్ళతోనే ప్రత్యర్థుల్లో భయాన్ని చూపించగలిగినా.. అదంతా పవన్‌ కళ్యాణ్‌కే చెల్లింది. పవన్‌ కళ్యాణ్‌ గొప్ప డాన్సరేమీ కాదు.. వరుసగా సినిమాలూ చేసెయ్యలేదు.. తన సినిమాల్ని ఎక్కువగా పబ్లిసిటీ కూడా చేసుకోలేదు. సినిమా చేయడం మాత్రమే ఆయనకు తెలుసు.. దాన్ని ప్రమోట్‌ చేసుకోవాలన్న కనీస ఆలోచన పవన్‌ కళ్యాణ్‌కి వుండేది కాదు. అన్నయ్య చాటు తమ్ముడిగా సినీ రంగంలోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌.. అన్నయ్యను మించిన ‘బాక్సాఫీస్‌ శక్తి’గా ఎదిగాడు.

పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లో హిట్టు సినిమాలెన్ని.? ఫ్లాపు సినిమాలెన్ని.? అన్న లెక్కలు తీస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఓ మోస్తరు సినిమాల్ని కూడా పవన్‌ అభిమానులు ఫ్లాప్‌ సినిమాలనే అంటారు. వారి దృష్టిలో ‘జల్సా’ సినిమా కూడా హిట్టు కాదు. ‘పవన్‌ కళ్యాణ్‌ పవర్‌కి తగ్గ సినిమా కాదు..’ అన్నది వారి వాదన. ఫ్లాప్‌ సినిమా చేసినా, హిట్టు సినిమా తరహా వసూళ్ళను సాధించడం పవన్‌ కళ్యాణ్‌కి సర్వసాధారణమైన విషయమే.

తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే స్థాయికి చేరుకున్న పవన్‌, అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి, సినిమాలకు దాదాపుగా గుడ్‌ బై చెప్పేశారిప్పుడు. రాజకీయాల్లో నిజానికి పవన్‌ విజయాలు సాధించిందేమీ లేదు. అయినాగానీ, పవన్‌ కళ్యాణ్‌కున్న ‘పవర్‌’ తగ్గలేదు సరికదా.. పదింతలయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడట.. వెన్నునొప్పి కారణంగా మంచానికే పరిమితమవ్వాల్సిందేనట.. అంటూ ఎవరెన్ని దుష్ప్రచారాలు చేస్తున్నా.. హీ ఈజ్‌ రాకింగ్‌ పవర్‌ స్టార్‌.. అంతే.

అందుకే, పవన్‌ కళ్యాణ్‌ మీద అభిమానానికి ‘పవనిజం’ అని పేరు పెట్టుకున్నారు అభిమానులు. ‘ఒక్కసారి అభిమానించడం మొదలు పెట్టాక.. ప్రాణం పోయేదాకా ఆ అభిమానం తగ్గదు..’ అని చెప్పడం పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకి మాత్రమే చెల్లిందేమో. అభిమానులతో పబ్లిసిటీ స్టంట్లు చేయించుకోవడం పవన్‌ కళ్యాణ్‌కి తెలియదు.. బహుశా అదే, పవన్‌ కళ్యాణ్‌ని ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చిందేమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

రాజకీయం

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...