Switch to English

సినిమా రివ్యూ: వదలడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

నటీనటులు: సిద్దార్థ్, కాథరిన్ ట్రెసా తదితరులు.
ఎడిటర్‌: ప్రవీణ్ కె.ఎల్
సినిమాటోగ్రఫీ: ఎన్.కె ఏకాంబరం
మ్యూజిక్: థమన్ ఎస్ఎస్
దర్శకత్వం: సాయి శేఖర్
నిర్మాణం: పారిజాత మూవీ క్రియేషన్స్
నిర్మాత: ఆర్. సౌందర్య – దీప అయ్యర్
విడుదల తేదీ: 11 అక్టోబర్ 2019

ఒకప్పుడు తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సిద్దార్థ్. కానీ తన సినిమాలు వరుసగా ఆడకపోవడంతో తెలుగులో మకాం సర్దేసి తమిళంలో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారిని పలకరిస్తుంటాడు. గత సినిమా ‘గృహం’తో ఆకట్టుకున్న సిద్దార్థ్ మరోసారి హర్రర్ థ్రిల్లర్ జానర్ లో చేసిన సినిమా ‘వదలడు’. కాథరిన్ ట్రేస హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హర్రర్ థ్రిల్లర్ ఎలా ఉందో..

కథ:

జగన్(సిద్దార్థ్) ఒక స్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్ట్ ఆఫీసర్. జగన్ కి వాసన చూసి ఎంత కల్తీ చేశారు చెప్పేయగల సామర్థ్యం ఉంటుంది. అలా స్ట్రిక్ట్ గా ఉన్న జగన్ పలువురు ఫుడ్ మాఫియా విలన్స్ నుంచి సమస్యలు వస్తుంటాయి. కానీ జగన్ మాత్రం ఎవ్వరికీ భయపడడు. అదే సమయంలో మథర్ థెరిస్సా భావాలున్న జ్యోతి(కాథరిన్ ట్రేస)ని చూసి ప్రేమలోపడతాడు. కానీ జ్యోతి రిజెక్ట్ చేస్తుంది. అదే సమయంలో ఫుడ్ కల్తీ విషయంలో జగన్ ని ఒకరోజు విలన్స్ చంపేయాలనుకుంటారు. అప్పుడు జగన్ ని చంపేసారా? లేదా? ఒకవేళ చంపేస్తే ఎవరి ద్వారా జగన్ ఫుడ్ మాఫియా విలన్స్ ని ఎలా ఆపాడు అనేదే కథ.

ఆన్ స్క్రీన్ స్టార్స్ పెర్ఫార్మన్స్:

సిద్దార్థ్ తన పాత్ర పరంగా చాలా మంచి నటనని కనబరిచాడు. ముఖ్యంగా తనకి వాసన చూసి ఫుడ్ కల్తీనా కాదా అని చెప్పే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అని తెలిపే మ్యానరిజమ్స్ బాగా చేసాడు. కాథరిన్ టీచర్ పాత్రలో క్యూట్ గా ఉండడమే కాకుండా నాచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్లాక్ లో తాళ్ళతో చేసే సీన్ లో చాలా బాగా చేసింది. ఎలాంగో కుమారవేల్ చేసింది చిన్న పాత్ర, కానీ ప్రీ క్లైమాక్స్ ముందు సిద్దార్థ్ తో చేసిన ఎమోషనల్ సీన్ బాగా చేసాడు. సతీష్ సపోర్టింగ్ రోల్ బాగుంది కానీ ఈ పాత్ర నుంచి కామెడీ ఆశిస్తాం కానీ అలాంటి కంటెంట్ లేకపోవడం కాస్త నిరాశపరుస్తుంది. విలన్ పాత్రల్లో కబీర్ సింగ్, మధుసూదన్ రావు బాగా చేశారు.

ఆఫ్ స్క్రీన్ స్టార్స్ టాలెంట్:

హారర్ థ్రిల్లర్ కథకి విజువల్స్ మరియు మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తాయి. ఆ విషయంలో రెండు డిపార్ట్ మెంట్స్ కి మంచి మార్క్ పడతాయి. కెఏ ఏకాంబరం సీన్ మూవ్డ్ కి తగ్గట్టు షాట్స్ కంపోజ్ చేసి తీశారు. కానీ కొన్ని చోట్ల ఈయన విజువల్స్ కి యాడ్ అయినా గ్రాఫిక్స్ మాత్రం బాలేదు. ఇక ఎస్ఎస్ థమన్ పాటలు తెలుగు వారికి కనెక్ట్ కావు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ప్రతి సీన్ ఎంగేజింగ్ గా ఉండేలా మ్యూజిక్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో కథ పరిగెత్తేలా చేసిన కట్స్ సూపర్బ్ అని చెప్పాలి.

డైరెక్టర్ సాయి శేఖర్ హర్రర్ థ్రిల్లర్ చేయాలనుకుని అదే జానర్ లో చాల ఆసినిమాల ఫార్మాట్ ని తీసుకున్నాడు. అందువల్ల ఎన్నో హర్రర్ సినిమాల బ్యాక్ డ్రాప్ లానే ఉండడం వల్ల కొత్తగా అనిపించదు. ‘కాంచన’ తరహాలోనే సినిమా ఫ్లో ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే కాంచన సినిమాలానే ఉంటుంది. కానీ డైరెక్టర్ ఎక్కడ సక్సెస్ అయ్యాడు అంటే ఫుడ్ కల్తీ గురించి చెప్పిన కొన్ని విషయాలు సెకండాఫ్ లో కట్టి పడేస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్ మొదటి 30 నిమిషాలు సినిమా అదిరింది. ఇక మిగిలిన అంశాలన్నీ చాలా రెగ్యులర్ గా అనిపిస్తాయి. డైరెక్టర్ గా తాను చెప్పాలనుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా రీచ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇదే పాయింట్ కి కాస్త టెక్నికల్ వాల్యూస్, సరికొత్త ప్రెజంటేషన్ తోడై ఉంటే సినిమా అదిరిపోయేది. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి.

సీటిమార్ పాయింట్స్:
– సెకండాఫ్ మొదటి 30 నిమిషాలు అదిరింది.
– ఫుడ్ కల్తీ గురించి చెప్పిన ప్రతి పాయింట్ థ్రిల్ చేస్తాయి.
– ట్రైన్ లో వచ్చే సిద్దార్థ్ ఎమోషనల్ సీన్
– కాథరిన్ – స్టూడెంట్ పేరెంట్స్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్
– కథకి మూలమైన పాయింట్

బోరింగ్ పాయింట్స్:
– కథని రెగ్యులర్ గా చెప్పటం
– ఫస్ట్ హాఫ్ స్లో గా ఉండడం
– వెరీ రెగ్యులర్ క్లైమాక్స్
– బోరింగ్ రొమాంటిక్ ట్రాక్
– బాడ్ గ్రాఫిక్స్
– కథని ఎలివేట్ చేసే విలనిజం లేకపోవడం.
– హారర్ సినిమా కానీ ఎక్కడా భయపెట్టకపోవడం.
– అసందర్భంగా వచ్చే పాటలు

విశ్లేషణ:

‘వదలడు’ – ఇదొక హార్రర్ – థ్రిల్లర్ సినిమా, కానీ ఇందులో హార్రర్ అనేది ఎక్కడా మిమ్మల్ని భయపెట్టదు, కానీ ఫుడ్ కల్తీ గురించి చెప్పిన ప్రతి పాయింట్ థ్రిల్ చేయడమే కాకుండా, ఫుడ్ విషయంలో ఇంత క్రైమ్ జరుగుతుందా అనేది భయాన్ని కలిగిస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరిలో తాము తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఆలోచనని కలిగిస్తుంది. మెసేజ్ పరంగా ఈ పాయింట్ చాలా బాగున్నా ఓవరాల్ గా 2 గంటల సినిమాగా చూసుకున్నప్పుడు ప్రేక్షకులని అంతగా ఎంగేజ్ చేయలేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. ‘వదలడు’ సినిమా కల్తీ ఫుడ్ గురించి అవగాహన కలిగించే సినిమానే తప్ప, ప్రేక్షకులని అలరించే సినిమా కాదు.

ఫైనల్ పంచ్: వదలడు – మెసేజ్ థ్రిల్ చేసినా సినిమా థ్రిల్ చేయదు.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...
నటీనటులు: సిద్దార్థ్, కాథరిన్ ట్రెసా తదితరులు. ఎడిటర్‌: ప్రవీణ్ కె.ఎల్ సినిమాటోగ్రఫీ: ఎన్.కె ఏకాంబరం మ్యూజిక్: థమన్ ఎస్ఎస్ దర్శకత్వం: సాయి శేఖర్ నిర్మాణం: పారిజాత మూవీ క్రియేషన్స్ నిర్మాత: ఆర్. సౌందర్య - దీప అయ్యర్ విడుదల తేదీ: 11 అక్టోబర్ 2019 ఒకప్పుడు తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సిద్దార్థ్. కానీ తన సినిమాలు వరుసగా ఆడకపోవడంతో తెలుగులో మకాం సర్దేసి తమిళంలో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు డబ్బింగ్...సినిమా రివ్యూ: వదలడు