Switch to English

అవి ‘పవర్’ఫుల్ వ్యాఖ్యలే.. పవన్ విరాళాల వ్యాఖ్యలపై సానుకూల చర్చ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

రాజకీయ నేతలు, ఇతర ధనిక సమాజం విరాళాలు ఇచ్చే విషయంలో అనుసరిస్తున్న వైఖరి గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పవన్ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వీరిలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీ శ్రేణులు కూడా ఉండటం విశేషం.

నిజానికి విరాళం ఇవ్వడం అనేది ఆయా మనుషుల తత్వాలను బట్టి ఉంటుంది. బలవంతంగా ఇచ్చేది విరాళం కాదు. అందరూ కర్ణుడిలా దానగుణం చూపించలేరు. కొందరు లేమిలోనూ దానం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు ఎంత ఉన్నా పైసా విదల్చరు. ఇక్కడ పవన్ ప్రస్తావించింది ఈ రెండో రకానికి చెందినవారినే.

రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల్లో కోట్లకు కోట్లు సంపాదించినవారు చాలామంది ఉన్నారు. ఇక రాజకీయ నాయకుల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిలో ఎంతమంది ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారన్నదే జనసేనాని ప్రశ్న. ఎన్నికల సమయంలో నోట్లు వెదజల్లుతుంటారు. ఓటుకు రూ. వెయ్యి, రూ.2వేలు అంటూ రేటు ఫిక్స్ చేసి కోట్లకు కోట్లు ఖర్చు పెడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు పదింతలు సంపాదించేందుకు సమయం మొత్తం కేటాయిస్తారు. ఇదంతా కాకుండా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉంటే.. ఎన్నికల్లో వారే గెలిపిస్తారు కదా అనేది పలువురు సంధిస్తున్న ప్రశ్న.

ఇందులోనూ నిజం లేకపోలేదు. ‘మావోడి దగ్గర బోలెడు డబ్బుంది. మొన్నటి ఎన్నికల్లో చాలా ఖర్చుపెట్టాడు. కరోనా టైంలో పైసా కూడా తీయలేదు. ఇలాంటప్పుడు నలుగురికీ సాయం చేస్తే మావోడి పరపతి ఎంతగానో పెరిగేది. కానీ ఏం చేస్తాం’ అంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి అనుచురుడు నిట్టూర్పు విడిచారు.

పవన్ చెప్పిందాంట్లో నూటికి నూరుపాళ్లు నిజం ఉందని ఆయన అంగీకరించారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ తరహాలో ఉన్నఆస్తిలో సింహ భాగం పంచేయమని ఎవరూ చెప్పరు. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే చేయిని వారు ఎన్నటికీ మరచిపోరు. పైగా అలాంటివాడే నాయకుడు అనిపించుకుంటారు. కరోనా కష్టకాలంలో సినీ నటుడు సోనూసూద్ చేసిందదే. అందుకే ఆయనకు అంత పేరొచ్చింది. సినిమాల్లో విలన్ గా ఉన్న ఆయన.. నిజజీవితంలో హీరో అయిపోయారు. మరి పవన్ మాటలతో కొంతమందిలోనైనా మార్పు వస్తే సంతోషమే కదా?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...