Switch to English

పరిషత్ పోరు: ‘బులుగు’ ఎన్నికల్లో గెలుపు ఎవరిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలో వున్నా విపక్షాల్ని తొక్కేయడం అనేది షరామామూలుగా జరిగే వ్యవహారమే అయినా, ఈసారి అది మరింత జుగుప్సాకరమైన స్థితికి చేరుకుంది. విపక్షాల నుంచి అభ్యర్థులు పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. నానా తంటాలూ పడి, ప్రాణాలకు తెగించి ఎవరన్నా బరిలోకి దిగితే చాలు.. వారి ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టడం, కేసులు బనాయించి లొంగదీసుకోవడం.. ఇలా పెద్ద వ్యవహారమే నడిచింది.

పరిషత్ ఎన్నికల ప్రక్రియ కరోనా పాండమిక్ కారణంగా సుదీర్ఘ కాలం వాయిదా పడి.. తిరిగి ప్రారంభమయ్యింది.. కోర్టుల జోక్యాలతో.. పరిషత్ ఎన్నికల ప్రక్రియ రద్దయినట్లు కనిపించినా.. ఎట్టకేలకు ఫలితాల వెల్లడిదాకా వచ్చింది. టీడీపీ, పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించింది. కానీ, టీడీపీ నుంచి కొందరు అభ్యర్థులు బరిలోకి దిగారు. అదే చిత్రం.

జనసేన సహా ఇతర రాజకీయ పార్టీలు పోటీలో వున్నా.. అదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే, అసలు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల్ని వైసీపీ రాజకీయంగా బతకనివ్వలేదు. చాలామందిని భయపెట్టి, ప్రలోభపెట్టి.. ఎలాగైతేనేం, లొంగదీసుకుంది.. ఇంత జరిగాక, పరిషత్ ఫలితాలపై ఎవరికి మాత్రం ఆసక్తి వుంటుంది.?

ఎటూ గెలుపు వైసీపీ పక్షమే. ఈమాత్రందానికి ఎన్నికలెందుకు.. నామినేటెడ్ పదవుల తరహాలో, ఎంపీటీసీ – జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్ని ప్రకటించేయొచ్చు కదా.? అసలు వీటి వల్ల ఎవరికి ఉపయోగం.? ఎవరికీ ఉపయోగం లేని ఎన్నికలివి. ‘మేం గెలిచాం..’ అని వైసీపీ చెప్పుకుంటోంటే.. జనం నవ్విపోతున్నారు. ‘ఇవొక ఎన్నికలు.. ఇందలో మీరు గెలిచారు.? నవ్విపోదురుగాక.?’ అన్నట్టు జనం, అధికార పార్టీ వైపు చూస్తున్నారు.

తెలంగాణలో నిమజ్జన మహోత్సవం ఘనంగా జరుగుతోంది.. ఏపీలో ‘కరోనాని’ బూచిగా చూపి, వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం మోకాలడ్డింది. ప్రైవేటు స్థలాల్లో కొన్ని విగ్రహాలు పెట్టుకున్నా.. అసలు వినాయక చవితి సందడే లేదు. కానీ, పరిషత్ ఎన్నికల ఫలితాల పేరుతో వైసీపీ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వందల మందిని వెంటేసుకుని, వైసీపీ నేత జోగి రమేష్, ప్రతిపక్ష నేత ఇంటిపైకి దాడికి వెళ్ళడానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లే కనిపించింది.. అంతా అధికార పార్టీ మయమే.. అసలు ఇదేం రాజకీయం.? ఇదేం ప్రజాస్వామ్యం.? ఇదంతా బులుగు రాజ్యాంగం మరి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....