Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసేందుకు దర్శకుడు సుకుమార్ హడావుడిగా ఉన్నాడు. ఈ సమయంలో సినిమాకు సంబంధించిన వార్త ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ సినిమాకు ఇప్పటి వరకు ఆంటోనీ రూబిన్ ఎడిటర్ గా వ్యవహరించారు. అయితే ఇటీవల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. దాంతో వెంటనే దర్శకుడు సుకుమార్ ఈ సినిమా ఎడిటర్ గా నవీన్ నూలి ని రీప్లేస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. జాతీయ అవార్డు దక్కించుకున్న నవీన్ నూలి ఈ సినిమాకు న్యాయం చేస్తాడని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారట.
ఈ రీప్లేస్‌మెంట్ విషయమై పుష్ప 2 మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అతి త్వరలోనే ఈ విషయమై అధికారికంగా ప్రకటన వస్తుందేమో చూడాలి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ తో ఐటం సాంగ్ చేయిస్తున్నారు. ఇటీవలే అనసూయ బర్త్ డే పోస్టర్ ను విడుదల చేసి అంచనాలు పెంచారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట విడుదల అయ్యింది.