పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan) ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అకౌంట్ ఓపెన్ చేసి పది రోజులు దాటింది. ప్రస్తుతం పవన్ ని ఇన్ స్టా లో 2.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అందులో అప్డేట్స్ ఎప్పుడెప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం ఎట్టకేలకు ఆయన తొలి పోస్ట్ గా ఓ వీడియోని షేర్ చేశారు. తన సినీ జీవితంలో ఆయన కలిసిన పని చేసిన వ్యక్తులను గుర్తు చేసుకుంటూ ‘ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు’ పేరుతో వీడియోని పంచుకున్నారు. ‘చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులైన, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి’ అని నోట్ రాశారు.
ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi),నందమూరి బాలకృష్ణ( Balakrishna)నాగార్జున( Nagarjuna)వంటి సీనియర్ హీరోలు, ప్రభాస్( Prabhas), జూనియర్ ఎన్టీఆర్( Jr NTR), రామ్ చరణ్( Ram Charan), మహేష్ బాబు( Mahesh Babu),అల్లు అర్జున్( Allu Arjun తదితర యంగ్ హీరోలు, దివంగత దర్శకుడు కే విశ్వనాథ్, అమితాబ్ బచ్చన్ తదితరులు కనిపించారు. ఇప్పటివరకు పవన్ నటించిన సినిమాలు, హాజరైన వేడుకలకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ఈ వీడియోలో చూపించారు.
పవన్ ప్రస్తుతం వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికొస్తే ఆయన తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej)తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ ఈనెల 28న విడుదల కానుంది. దీంతోపాటు పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాలను పూర్తిచేసే పనిలో ఉన్నారు.
పవర్ స్టార్ ఇన్ స్టా హైలెట్స్ ఇవే..
* ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా మాత్రమే అభిమానులకి చేరువగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan)జూలై 4న ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆరోజు సాయుధ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన ఇన్స్టాలోకి అడుగుపెట్టారు.
* ‘ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో.. జై హింద్’ అని ఇన్స్టా బయోలో రాసుకున్నారు.
* ఒక్క పోస్టు పెట్టకుండా ఈ ఫ్లాట్ ఫామ్ లో అతి తక్కువ కాలంలో వన్ మిలియన్ మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవర్ స్టార్.
View this post on Instagram