Switch to English

ఏపీలో దళిత యువకుడిపై మరో ‘పోలీస్‌’ దాష్టీకం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో దళితులపై పోలీసుల దాష్టీకం కొనసాగుతోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఓ దళిత యువకుడికి పోలీస్‌ స్టేషన్‌లో ఓ పోలీస్‌ అధికారి శిరోముండనం చేయించిన ఘటన పెను రాజకీయ దుమారానికి కారణమైన విషయం విదితమే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఈ విషయంలో సీరియస్‌ యాక్షన్‌కి ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. మరో ఘటనలో ఓ దళిత యువకుడిపై ఓ పోలీస్‌ అధికారి దాడి కారణంగా, ఆ దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

తాజాగా, శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ దళిత యువకుడు, ఇళ్ళ పట్టాల విషయమై స్థానిక వైసీపీ నేతల్ని ప్రశ్నించినందుకుగాను వేధింపులకు గురయ్యాడు.. అతనిపై దాడి జరిగింది. తన బాధను పోలీసుల వద్ద మొరపెట్టుకునేందుకు వెళితే, పోలీస్‌ అధికారి.. ఆ యువకుడి ఆవేదనను పట్టించుకోలేదు సరికదా, అతనిపై దాడికి దిగిన విషయం ఇప్పుడు ఓ వీడియో రూపంలో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో బాధితుడి తల్లి కూడా అక్కడే వున్నారు. తన కుమారుడిపై పోలీస్‌ దాడి చేస్తోన్న సమయంలో ఏమీ చేయలేక విలవిల్లాడింది ఆ మాతృమూర్తి.

తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న శిరోముండనం ఘటనపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్పందించారు. చీరాల ఘటనలోనూ బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఇవే తరహా దాడులు మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్‌ అవుతున్నాయి.? పైగా, ఈ తరహా కేసుల్లో వైసీపీ నేతల చుట్టూనే వివాదాలు ముసురుకుంటున్నాయి.

హోంమంత్రి దళిత మహిళ అయి వుండీ, దళితులపై దాడుల్ని నివారించలేకపోవడం దారుణమంటూ విపక్షాలు విమర్శిస్తున్న విషయం విదితమే. పోలీసుల ప్రమేయం వున్న దాడులు సైతం దళితులపై పెరిగిపోతున్నాయంటే, ఈ దాడులకు హోంమంత్రి బాధ్యత వహించాలన్న డిమాండ్లు చాలా గట్టిగా తెరపైకొస్తున్నాయి. మరోపక్క, అధికార పార్టీకి చెందిన నేతలు వివిధ సందర్భాల్లో దళితులపై దాడులు చేస్తున్న వైనంపై పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ లేకపోలేదు.

ఏదిఏమైనా, ఈ తరహా దాడులు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి. ప్రభుత్వం తరఫున ‘మేం చర్యలు తీసుకుంటున్నాం..’ అనే బుకాయింపులు ఎన్నాళ్ళు.? ఈ ప్రభుత్వ హయాంలో దళితులకు అభయం దక్కదా.? అన్న ఆవేదన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...