Switch to English

ఆడు మగాడ్రా బుజ్జీ.. ఒకే ఒక్కడు వైఎస్‌ జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

సినిమా హీరో కొడుకు మళ్లీ సినిమా హీరో అయితే తప్పేంటీ.? డాక్టర్‌ కొడుకు డాక్టర్‌ కావచ్చు.. రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయాల్లోకి రావచ్చు. కొడుకులకే కాదు, ఈ నియమం కూతుళ్లకీ వర్తిస్తుంది. పండిత పుత్ర పరమ శుంఠ అన్న నానుడి ఉన్నట్లుగానే తండ్రిని మించిన వారసులూ కనిపిస్తారు. ములాయం సింగ్‌ తనయుడు అఖిలేష్‌ యాదవ్‌, యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాజకీయ వారసత్వంలో గాంధీ కుటుంబానికి సాటి ఇంకోటి లేదు.

కానీ, తెలుగు నాట తండ్రికి తగ్గ తనయులు రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. ముఖ్యమంత్రిగా పని చేసిన పలువురు ప్రముఖుల వారసులు రాజకీయాల్లో తండ్రిని మించిన స్థాయికి చేరుకోలేకపోయారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం. ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. కానీ ముఖ్యమంత్రి పీటమెక్కలేకపోయారు. తండ్రి మరణానంతరం కొత్త రాజకీయ పార్టీ పెట్ట, దాన్ని నడపలేకపోయారాయన. నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్‌ స్పీకర్‌ స్థాయి నుండి ఎదగలేకపోయారు.

మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌ కావచ్చు, కాసు బ్రహ్మానందరెడ్డి తనయుడు కాసు కృష్ణారెడ్డి కావచ్చు.. కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి కావచ్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ముఖ్యమంత్రి తనయులు తండ్రిని మించలేదు సరికదా.. కనీసం తండ్రి స్థాయికి కూడా చేరుకోలేకపోయారు. ఇలా ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డ్‌ని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం, తర్వాత ఆ పార్టీలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్న జగన్‌, కాంగ్రెస్‌ నుండి బయటికొచ్చి, సొంత కుంపటి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించడం తెలిసిన సంగతులే.

2014లో ఆ పార్టీ ఓటమి తర్వాత నెగిటివ్‌ సెంటిమెంట్‌ కారణంగానే జగన్‌ ముఖ్యమంత్రి కాలేకపోయాడనీ, తెలుగు రాజకీయాల్లో వారసులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదనీ, అందరూ అనుకున్నారు. కానీ, అందరి అంచనాల్నీ తలకిందులు చేస్తూ ఇటీవల ఎన్నికల్లో అనూహ్యం విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అందుకే ‘ఆడు మగాడ్రా బుజ్జీ.. వైఎస్‌ జగన్‌ తెలుగునాట ఒకే ఒక్కడు’. జగన్‌ రికార్డుని భవిష్యత్తులో ఇంకెవరైనా సమం చేస్తారా.? ఆ అవకాశం ఎవరికుంది.? సమీప భవిష్యత్తులో కల్వకుంట్ల తారకరామారావుకు మాత్రమే ఆ ఛాన్స్‌ కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణకు ఆ అవకాశం ఉన్నా, అంతటి సమర్ధత ఆయనకు లేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...