ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు మరో సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టాడు. దాదాపు మూడేళ్ల క్రితం నాగార్జునతో తీసిన షిరిడీసాయి సినిమా తరువాత దర్శకేంద్రుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలపై దృష్టి పెట్టి పలు కీర్తనలు ఆడియో, వీడియొ రూపంగా మలచడంలో బిజీ అయ్యాడు. ఆ పని పూర్తయిన తరువాత దర్శకేంద్రుడు మళ్ళీ భక్తి సినిమా తీస్తాడేమో అని అనుకున్నారు అందరు .. కానీ దానికి బిన్నంగా మరో రొమాంటిక్ సినిమాతో ముందుకు వస్తున్నారు అయన. విభిన్న తరహాలో తెరకెక్కే ఈ సినిమాలో హీరోగా కుర్ర హీరో నాగశౌర్య నటిస్తాడట. అయితే ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నట్టు .. ముగ్గురు దర్శకులు ఈ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతుంది.
ఈ ముగ్గురిలో ఇప్పటికే ఒక దర్శకుడిగా క్రిష్ ని ఎంపిక చేశారట. అన్నట్టు ఇందులో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉంటారని టాక్. హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. అయితే ఈ ముగ్గురి హీరోయిన్స్ లైఫ్ వేరు వేరుగా ఉంటుందని ఒక్కో కథను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తాడట. ఈ మూడు కథల్లో ఒకే హీరో అంటే నాగ శౌర్య ఉంటాడని టాక్. ఈ ముగ్గురు అమ్మాయిలకు కథను క్లామాక్స్ లో లింక్ పెడుతూ ఆసక్తికరంగా సాగిపోతుందట. మొత్తానికి ఇప్పటీకే సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా జులై లో పట్టాలు ఎక్కనుంది.
ప్రస్తుతం నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. దర్శకేంద్రుడి నేతృత్వంలో సినిమా అనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాలో ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరు ? మిగతా ఇద్దరు దర్శకులు ఎవరన్నది త్వరలోనే ప్రకటిస్తారట. ఈ మద్యే కేర్ అఫ్ కంచర పాలెం .. సినిమా తరహాలో నాలుగు కథలు .. చివరికి ఒకే ముగింపుతో సాగడం అందరిని ఆకట్టుకుంది. అదే తరహాలో ఇప్పుడు దర్శకేంద్రుడి ప్రయత్నం అన్నమాట.
172544 89256Thanks for this wonderful post! It has long been really beneficial. I wish that youll carry on posting your wisdom with us. 530716
910755 276641Wow, amazing weblog layout! How long have you been blogging for? you make blogging look simple. The overall appear of your internet website is wonderful, let alone the content material! 708576
840408 863346The electronic cigarette makes use of a battery and a small heating aspect the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 133711