Switch to English

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు వేలాది మంది అభిమానులు, వందలాది మంది ప్రముఖుల సమక్షంలో, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ప్రాంగణంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను..’ అంటూ వైఎస్‌ జగన్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే, స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది.

భారీ ఏర్పాట్ల నడుమ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గవర్నర్‌ నరసింహన్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్‌ జగన్‌ ఒక్కరే ఈ రోజు పదవీ ప్రమాణ స్వీకారం చేయగా, మంత్రులుగా తన క్యాబినెట్‌లో ఎవరెవరు వుండాలన్నదానిపై కొద్ది రోజుల్లోనే కసరత్తును జగన్‌ పూర్తి చేస్తే, ఆయా మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారాలు త్వరలో జరుగుతాయి.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలంతా తమ అధినేత ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి సకుటుంబ సపరివార సమేతంగా హాజరయ్యారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ‘ఆత్మ’గా పేరొందిన కేవీపీ రామచంద్రరావు కూడా ఈ వేడుకలో మరో ప్రధాన ఆకర్షణగా మారారు. డీఎంకే అధినేత స్టాలిన్‌, వివిధ రాష్ట్రాలకు చెందిన ఇతర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ స్వయంగా పలువురు దేశవ్యాప్త ప్రముఖులకు ఆహ్వానం పలుకగా, అందులో చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదిలా వుంటే, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడ నగరమంతా జగన్‌ కటౌట్లు, ప్లెక్సీలతో నిండిపోయింది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో అయితే ఇసుక వేస్తే రాలనంత హంగామా కన్పించింది. నిన్నటిదాకా భగ్గుమన్న భానుడు, వైఎస్‌ జగన్‌ పదవీ ప్రమాణ స్వీకారం కోసమేనా? అన్నట్లుగా కాస్త శాంతించాడు. వరుణుడూ కరుణించాడు. చిరుజల్లులు కురియడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో, అంచనాలకు మించి జనం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

బిగ్‌బాస్‌ తెలుగు-5 : ప్రియ వ్యాఖ్యలతో రచ్చరచ్చ – ఎపిసోడ్ –...

బిగ్ బాస్ లో సోమవారం వస్తుంది అంటే ప్రేక్షకులు కళ్లు పెద్దవి చేసి చూస్తారు.. కంటెస్టెంట్స్ కారాలు మిరియాలు నూరుతూ రచ్చ చేసేందుకు సిద్దం అవుతారు....

సమంత ఎమోషనల్ ట్వీట్..! నాగ చైతన్యను ఉద్దేశించేనా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం 'చైసామ్' ల విషయమే. ఎంతో చూడముచ్చటగా, అన్యోన్యంగా కనిపించిన నాగ చైతన్య, సమంతల జంట...

తండ్రి, అన్న బాటలో షర్మిల..! తెలంగాణాలో పాదయాత్ర

'పాదయాత్ర' అంటే గుర్తొచ్చేది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరే. తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వీరిద్దరూ పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారనేది...

చిరంజీవి అంటే జగన్ కు అభిమానం.. పరిశ్రమ అభివృద్ధికి ఓకె: పేర్ని...

చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవమని, ఆయనను సోదరభావంతో చూస్తారని.. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా...

రాజకీయం

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

గోదావరి వైకాపాలో గ్రూప్‌ రాజకీయం

తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా నాయకుల మద్య గ్రూప్‌ రాజకీయం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీల మద్య జరుగుతున్న ఆధిపత్యం తీవ్రం అయ్యింది. రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు...

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

టీడీపీ మార్కు చారిత్రక తప్పిదం.! ఇక గల్లంతైపోయినట్టే.!

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. స్థానిక ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయో, ఎలాంటి రాజకీయాలు ఆ ఎన్నికల చుట్టూ వుంటాయో.. చంద్రబాబుకి...

ఎక్కువ చదివినవి

సైదాబాద్ బాలిక కుటుంబానికి పవన్ పరామర్శ..! అండగా ఉంటానని హామీ..!!

హైదరాబాద్ లోని సైదాబాద్ లో అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులను ఆయన పరామర్శించారు. జరిగిన ఘటన తననెంతో కలచివేసిందని...

ఈ దసరాకు ఎన్టీఆర్, మహేష్ ఒకే స్క్రీన్ పై!!

టాప్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య స్పెషల్ బాండింగ్ ఉంది. మహేష్ భరత్ అనే నేను సినిమా ఈవెంట్ కు ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్...

త్రిష, కీర్తితో పార్టీ చేసుకున్న సమంత

రీసెంట్ గా సమంత తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలపై వార్తల్లో ఉంటూ వస్తోంది. వాటిపై పెదవి విప్పని సమంత తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా జీవిస్తోంది. సమంత తన...

వైఎస్ షర్మిల ఏపీలో ‘దీక్ష’ చేస్తే.. అనుమతిస్తారా.?

తెలంగాణకీ, ఆంధ్రప్రదేశ్‌కీ ‘తేడా’ ఏంటో స్పష్టంగా నిన్ననే అర్థమయ్యింది చాలామందికి. ఏపీలో రాజకీయాలెలా వున్నాయ్.? తెలంగాణలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయ్.? అన్నదానిపై చాలామందికి చాలా స్పష్టంగా అవగాహన వచ్చేసింది. తెలంగాణలో విపక్షాలు గొంతు...

జస్ట్ ఆస్కింగ్: పెట్రో దోపిడీకి ఇదా సమయం.?

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ వచ్చేస్తాయంటూ మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రత్యేక హోదా విషయంలోనూ ఇదే ‘మీడియా దందా’ నడిచింది. ఔను, నరేంద్ర మోడీ ప్రధాని అయితే.. ఆంధ్రప్రదేశ్...