అది ఓ పక్షి. అయినా దానికీ పేరుంది. పేరు టోట్సీ. ఆ పక్షి ఇప్పుడు ప్రెగ్నెంట్. కానీ, దానికి ఓ మెడికల్ ప్రాబ్లెమ్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అర్జెంట్‌గా సర్జరీ చేయాలన్నారు. చేయించేశారు. కానీ అది కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది. టోట్సీ కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధించమంటోంది ముద్దుగుమ్మ నికీషా పటేల్. అసలీ పక్షేంటీ.? ఈ గోలేంటీ.? అనుకుంటున్నారా.?
అవునండీ చాలా మంది జంతు ప్రేమికులూ, పక్షి ప్రేమికుల్నీ చూసే ఉంటారు కదా. అలా మన హాట్ బ్యూటీ నికీషా పటేల్‌కి పక్షులంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఓ పక్షిని పెంచుకుంది. ఆ పక్షికి ముద్దుగా ‘టోట్సీ’ అని పేరు పెట్టుకుంది. ఆ పక్షికే ఇప్పుడు మెడికల్ ప్రాబ్లెమ్ కారణంగా సర్జరీ చేయించాల్సి వచ్చిందట. చేయించేసిందట. ఆ పక్షి కోలుకుని తనతో సరదాగా మళ్లీ ఆడుకోవాలని నికీషా పటేల్ సోషల్ మీడియా ద్వారా ఈ పక్షి కథను ఫ్యాన్స్‌తో పంచుకుంది. కథ బాగానే ఉంది. కానీ, మరీ టూమచ్‌గా లేదండీ.. అందుకే ఇలాంటి కామెంట్లే సోషల్ మీడియాలో నికీషా ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఓవరాక్షన్ కాస్త ఎక్కువయ్యిందంటూ ఆమెని చాలా మంది విమర్శిస్తున్నారు. బర్ద్కే ఇంత హంగామా చేయాలా.? అని ఆడిపోసుకుంటున్నారు. అయినా, మీకేం తెలుస్తుందిలెండి మా పక్షి ప్రేమికుల కష్టాలు అంటారు ఇంకొంతమంది. అవును మరి, వాటిని పెంచుకున్న వాళ్లకే తెలుస్తుంది ఆ అఫెక్షన్ ఏంటనేది.
చాలా మంది కోళ్లు, కుక్కలు, పిల్లులు, ఆఖరికి పాముల్ని కూడా పెంచుకుంటుంటారు. వాటితో ఆయా వ్యక్తుల ప్రేమ ప్రత్యేకమైనది. అలా టోట్సీ పట్ల నికీషా పటేల్ తెగ ప్రేమ పెంచేసుకున్నట్లుంది. అందుకే దానికి ఒంట్లో బాగాలేకపోయేసరికి పాపం ఈ హాట్ బ్యూటీ తెగ బాధపడిపోతోంది. ఈ కహానీ అంతా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అన్నట్లు టోట్సీకి సర్జరీ చేసిన డాక్టర్ పేరు కూడా నికీషా ప్రస్థావించిందండోయ్. ఆ డాక్టర్ పేరు రీనా అట. అదే పోనిలెండి. ప్రార్ధించేద్దాం టోట్సీ కోలుకోవాలని. అన్నట్లు అది ప్రెగ్నెంట్ అని చెప్పింది కదా.! సో అనారోగ్యం నుండి కోలుకుని మరిన్ని బుల్లి బుజ్జి క్యూట్ టోట్సీల (ఒకటి కాదు చాలానే గుడ్లు పెట్టాలి కదా) కోసం బోలెడన్ని గుడ్లు పెట్టాలని కోరుకుందాం.