2023 పూర్తి కావొస్తోంది. ప్రతీ సంవత్సరం ఎంతో మంది దర్శకులు అరంగేట్రం చేస్తూ ఉంటారు. మరి అదే కోవలో ఈ సంవత్సరం తమ డెబ్యూ చేసి సత్తా చాటిన కొత్త దర్శకులు ఎవరో ఒకసారి లుక్కేద్దాం.
ముందుగా ఈ ఏడాది అందరినీ సర్ప్రైజ్ చేసిన దర్శకుడు వేణు అని చెప్పాలి. స్వతహాగా కమెడియన్ అయిన వేణు బలగం వంటి హృద్యమైన కథను తీసుకుని దాన్ని అంతే ఎఫెక్టివ్ గా చూపించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది.
ఇక ఈ ఏడాది నాని ఇద్దరు కొత్త దర్శకులతో పనిచేసాడు. శ్రీకాంత్ ఓదెలతో చేసిన దసరా తనను మాస్ హీరోగా నిలబెడితే, శౌర్యువ్ తో చేసిన హై నాన్న, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఆడింది. అలాగే కళ్యాణ్ శంకర్ మ్యాడ్ సినిమాతో యూత్ కు కిక్ ఇచ్చాడు.