Harish Shankar: మాస్ మహారాజ్ రవితేజ (Ravi Tej)– దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో నటించేందుకు ఇద్దరు హీరోయిన్లు నో చెప్పినట్టు నెట్టింట వార్త వైరల్ అయింది. కాల్షీట్స్ అడ్జెస్ట్ చేయలేక మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary), మరో హీరోయిన్ ఇలియానా (Ileana) రిజెక్ట్ చేయడంతో యానిమల్ భామ త్రిప్తి దిర్మిని సంప్రదిస్తున్నట్టు ట్వీట్ వైరల్ అయింది. దీనిపై దర్శకుడు హరీశ్ శంకర్ సమాధానం ఇచ్చారు.
‘ఇది పూర్తిగా అవాస్తవం. నా ట్రాక్ రికార్డ్ తెలిసిన వారెవరూ హీరోయిన్ల ఎంపిక విషయంలో నన్ను తప్పు పట్టలేరు.. అది శృతి హాసన్ లేదా పూజా హెగ్డే అయినా. యానిమల్ విడుదలకు ముందే మా సినిమా క్యాస్టింగ్ సిద్ధమైపోయింది. దయచేసి.. ఎటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయెద్దు. మీకు ఏ సమాచారం లేదా సందేహం ఉంటే నేను, రవితేజ ఒక్క మెసేజ్ కు అందుబాటులో ఉంటామ’ని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. హిందీలో రిలీజైన ఓ హిట్ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తోంది.