కింగ్ నాగార్జున తాజాగా సినిమాలే కాదు అటు టివి షో లలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మధ్య మీలోఎవరు కోటీశ్వరుడు అంటూ ఓ క్విజ్ ప్రోగ్రాం చేసి సక్సెస్ అందుకున్న నాగ్ తాజాగా తెలుగు సంచలన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 21 నుండి ప్రారంభం అయ్యే ఈ షో కోసం ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. అయ్యితే ఈ రియాలిటీ షో కోసం నాగ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఫిలిం వర్గాల్లో సంచలనంగా మారింది ? ఈ సీజన్ 3 కోసం నాగ్ ఏకంగా 12 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంటే ఒక్కో ఎపిసోడ్ కోసం అయన 12 లక్షలు అందుకుంటున్నాడన్నమాట.
నిజానికి నాగ్ ఈ షో కోసం ఎక్కువే డిమాండ్ చేసాడని .. కానీ నిర్వాహకులు మాత్రం ఇదే ఫిగర్ ఇస్తామని చెప్పారని దాంతో నాగ్ ఓకే చెప్పడంతో షో కి హోస్ట్ గా కన్ఫర్మ్ అయిందట. గత రెండు సీజన్స్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ముడో సీజన్ పై అందరి ఫోకస్ పడింది. ఇప్పటికే ప్రోమోస్ తో ఈ షోపై ఆసక్తి పెంచుతున్నాడు. 14 మంది కంటెస్టెంట్ తో వంద రోజుల పాటు జరిగే ఈ రియాలిటీ షో తో నాగ్ తప్పకుండా మరింత క్రేజ్ తెస్తాడని భావిస్తున్నారు నిర్వాహకులు.
అయితే నాగ్ తీసుకున్న రెమ్యూనరేషన్ విషయంలో నిజ నిజాలు ఏమిటన్నది పక్కన పెడితే నాగ్ ప్రస్తుతం మన్మధుడు 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. దాని తరువాత అయన బంగార్రాజు ను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.
370734 276206excellent . Thanks for informations . Ill be back. Thanks again 127785
235887 978763Hi this really is somewhat of off subject but I was wondering if blogs use WYSIWYG editors or should you have to manually code with HTML. Im starting a blog soon but have no coding knowledge so I wanted to get guidance from someone with experience. Any assist would be greatly appreciated! 240673
731217 555345I love your wp format, exactly where did you get a hold of it? 298655
811516 614723I just want to tell you that Im really new to weblog and honestly liked this web website. Much more than likely Im preparing to bookmark your blog post . You undoubtedly come with exceptional articles and reviews. Bless you for sharing your internet site. 823371