Switch to English

ఆ మంత్రులకి జగన్‌ రెండో ప్రమాద హెచ్చరిక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆరు నెలలు తిరగకుండానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మంత్రి వర్గం నుండి కొందరికి ఉద్వాసన పలకనున్నారా.? అంటే అవుననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిప్పు లేకుండా పొగ రాదు.. అనే మాట సర్వ సాధారణంగా వింటుంటాం. కానీ, రాజకీయాల్లో కొన్నిసార్లు నిప్పు లేకుండానే పొగ వస్తుంది. ఆ పొగ ఎఫెక్ట్‌ కొందర్ని ఇంటికి పంపించేస్తుంది కూడా. ఇంతకీ జగన్‌ మంత్రి వర్గంలో ఏం జరుగుతోంది.?

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టి నెల రోజులు మాత్రమే పూర్తైంది. ఇంతలోనే మంత్రి వర్గం గురించి ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి.? అంటే దానికీ ఓ బలమైన కారణం ఉందంటున్నారు కొందరు. దాదాపుగా కాల గర్భంలో కలిసిపోయిన పరిస్థితి నుండి, తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఊపు వచ్చే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. 6 నెలలు ప్రభుత్వానికి సమయమిస్తారన్నారు కదా.. అనే ఆలోచనతో కొందరు వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా మంత్రులు కాస్తంత అలసత్వం ప్రదర్శిస్తున్న మాట వాస్తవం.

అందులోనూ, కొందరు మంత్రులైతే, తమకు పార్టీ వ్యవహారాలతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అటు ప్రభుత్వంలో ఏం జరుగుతోందో, ఇటు పార్టీలో ఏం జరుగుతోందో, బయటి రాజకీయ పరిస్థితులేంటో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న వైఎస్‌ జగన్‌ లిస్టులో లీస్ట్‌ మార్కులొచ్చినవారిని ఎంపిక చేసి, ఆల్రెడీ ఓ సారి వార్నింగ్‌ ఇచ్చారట. అయితే, వారిలో జగన్‌ ఆశించిన మార్పు కనిపించలేదట.

తాజాగా ఎమ్మెల్యే శిక్షణ కార్యక్రమంలో సుతిమెత్తగా వైఎస్‌ జగన్‌ హెచ్చరికలు జారీ చేశారు కూడా. ఈ హెచ్చరికల్ని కొందరు మంత్రులకు సెకండ్‌ వార్నింగ్‌గా అభివర్ణిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి వార్నింగ్‌ ఇచ్చే పరిస్థితి వస్తే, అక్కడితో పదవి ఊడిపోయినట్లేనట. ప్రతిపక్షం యాక్టివ్‌ అవుతోందంటే, అధికార పక్షం డీలా పడుతున్నట్లే లెక్క. మన మీద టీడీపీ విమర్శలు చేస్తున్నప్పుడు స్పందించకపోతే, అధికార పార్టీపై విపక్షాలు చేసే ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లవుతుంది.. అన్నది వైఎస్‌ జగన్‌ అభిప్రాయంగా కనిపిస్తోంది. అది నిజం కూడా. మరి జగన్‌ హెచ్చరికలకు ఇకనైనా సదరు మంత్రులు అలర్ట్‌ అవుతారా.? పదవులకు ఆపద కొని తెచ్చుకుంటారా.? వేచి చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...