Naga Chaitanya: యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా విక్రమ్ కె.కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’ (Dhootha). ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ పై ఎదురైన ప్రశ్నకు నాగ చైతన్య సమాధానం ఇచ్చారు.
‘జరిగిన దానిపై నేను ఆలోచించను. నా పని ద్వారానే నేను సమాధానం చెప్పాలనుకుంటా. ఓ పరిధి దాటాక నేను మరే విషయంపై ఆలోచించను. నా చుట్టూ ఉన్నవారికి నేనేంటో తెలుసు. నా పనిపైనే దృష్టి పెట్టా. ఇకపై నేనేంటో నా సినిమాలే మాట్లాడతాయి. ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకునేలా సినిమాలు చేయాలి. దాని గురించే నేను ఆలోచిస్తున్నాన’ని అన్నారు.
నాగ చైతన్య తొలిసారి నటించిన వెబ్ సిరీస్ కావడంతో ఆసక్తి రేపుతోంది. జర్నలిస్ట్ సాగర్ వర్మ అవధూరిగా నాగ చైతన్య కనిపించారు. ప్రస్తుతం దూతకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు.