అమెరికాలో ఓ ఎన్నారై, తన బంధువు అయిన ఓ వ్యక్తి మీద వేధింపులకు పాల్పడ్డాడు.! ఇండియాలోలా కుదరదు కదా.! అక్కడ, ‘వేధింపులకు పాల్పడిన’ వ్యక్తిని అరెస్టు చేసి, లోపలేశారు.! వాడి నుంచి, బాధితుడికి విముక్తి కలిగింది.!
వేధింపులకు పాల్పడిన వ్యక్తికి, భారతదేశంలో.. అందునా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి. సన్నిహిత సంబంధాలేంటి.? ఓ రాజకీయ పార్టీ నాయకురాలి తనయుడు. ఆయన కూడా పార్టీలో కీలక వ్యక్తే.!
సదరు పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.! ఇకనేం, ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలకు ఇలాంటి ‘నేర ప్రవృత్తి’ సహజమే కదా అనుకునేరు.! తెలుగు రాష్ట్రాల్లోనో, భారతదేశంలోనో ‘దందా’ చేయడం వేరు, విదేశాలకు వెళ్ళి మరీ, నేరపూరిత కార్యకలాపాలు చేయడం వేరు.
భారతదేశంలో అయితే, నేరాలు చేసి చట్టాల నుంచి తప్పించుకోవచ్చు.! వారికి, రాజకీయం ఎప్పుడూ అండదండలు అందిస్తూనే వుంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏకంగా తన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని చంపేసి, తన కారులోనే మృతదేహాన్ని మృతుడి ఇంటికి డోర్ డెలివరీ చేసిన సంగతి తెలిసిందే.
విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడం, నేరం బయటపడిపోవడంతో.. చేసేది లేక, పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధినాయకత్వం అనంతబాబు విషయమై ప్రకటన చేసింది. కానీ, ఆ తర్వాత ఆయన్ని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన పక్కన తిప్పుకుంటుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఈ ఘటన చాలు, నేరపూరిత ఆరోపణలు వచ్చిన వ్యక్తుల పట్ల వైసీపీ ఎంతటి ప్రేమ చూపిస్తుందో చెప్పడానికి.! వైసీపీలో వుంటే నేరాలు చెయ్యాలనే రూల్ ఏమైనా వుందా.? అన్నట్లుంది అమెరికాలో జరిగిన ఘటన చూస్తే.
వైసీపీ తరఫున ఓ ప్రకటన వచ్చింది సోషల్ మీడియా వేదికగా. ‘సదరు వ్యక్తి చేసిన నేరం ఆయన వ్యక్తిగతం. పార్టీకి సంబంధం లేదు’ అని. పార్టీ పరమైన నేరాలు, వ్యక్తిగత నేరాలు.. వేర్వేరుగా వుంటాయా.? అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ దోషిగా తేలితే, ‘వ్యక్తిగతం’ అని, వైసీపీ తమ అధినేతను వదులుకుంటుందా.?