నటీనటులు : శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శిని, కాజల్, మురళి శర్మ, అజయ్, బ్రహ్మాజీ, ప్రవీణ్ తదితరులు ..
రేటింగ్ : 2. 75 / 5
సంగీతం : ప్రశాంత్ పిళ్ళై
కెమెరా : దివాకర్ మణి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుధీర్ వర్మ
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
ఈ మధ్య కాలంలో యంగ్ హీరో శర్వానంద్ తన పంధా మార్చుకున్నాడు. ఫక్తు కమర్షియల్ సినిమాలు కాకుండా భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రణరంగం అంటూ మరో భిన్నమైన ప్రయత్నం చేసాడు. స్వామిరారా తో దర్శకుడిగా పరిచయం అయిన సుధీర్ వర్మ కు ఆ తరువాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాన్ని అందించలేదు ..దాంతో శర్వానంద్ తో కలిసి సక్సెస్ కోసం చేసిన ప్రయత్నమే రణరంగం. మరి వీరిద్దరి సక్సెస్ ప్రయత్నం ఫలించిందా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
కథ :
వైజాగ్ లో అనాధగా పెరిగిన కుర్రాడు దేవా ( శర్వానంద్ ). తనలాంటి ఓ నలుగురు కుర్రాళ్లతో కలిసి చిన్న చితక పనులు చేస్తూ జీవితం సాగిస్తుంటాడు. 1990లో జరిగిన కథ ఇది. ఆ సయమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మద్యనిషేధం విదిస్తుంది. దాంతో పక్క రాష్ట్రం నుండి మద్యం తెచ్చి ఇక్కడి రాష్ట్రంలో అమ్మడం ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తుంటారు. ఈ దొంగ వ్యాపారం గురించి అక్కడి ఎం ఎల్ ఏ కు తెలియడంతో దాన్ని అడ్డుకుని అది తన సొంతం చేసుకోవాలని దేవా కు అడుగడుగునా అడ్డుపడుతూ ఉంటాడు. మరి ఆ అడ్డంకులను దేవా ఎలా ఎదుర్కొన్నాడు. చివరగా అతని జీవితం ఎక్కడికి సాగింది అన్నది మిగతా కథ.
నటీనటుల ప్రతిభ :
హీరో శర్వానంద్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తన పాత్ర విషయంలో ఎక్కువ కేర్ తీసుకునే శర్వానంద్ ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇందులో కూడా దేవా గా అలాంటి సహజ నటన కనబరిచే ప్రయత్నం చేసాడు. ఓ అనాధ కుర్రాడినుండి .. డాన్ గా మమారెంతవరకు అతని నటనలో పరిణితి కనిపిస్తుంది. ముఖ్యంగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని ఎమోషన్ సన్నివేశాల్లో సూపర్ అనిపించాడు. ఇక హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని సంప్రదాయమైన అమ్మాయిగా చక్కగా చేసింది. ముఖ్యంగా ఆమె లుక్ అందరిని ఆకట్టుకనేల ఉంది. ఇక మరో హీరోయిన్ కాజల్ గురించి చెప్పాలంటే మోడరన్ అమ్మాయిగా కాస్త హాట్ హాట్ అందాలతో కాజల్ చక్కగా చేసింది. తనకంటూ ప్రత్యేక ఉండేలా గ్లామర్ విషయంలో ఒకడుగు ముందుకే వేసింది. ఆమె పాత్ర కూడా ఉన్నంతలో బాగానే ఉంది. ఇక మురళి శర్మ .. ఎం ఎల్ ఏ పాత్రలో పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా నేటివిటీ మిస్ అయింది. కమెడియన్ సుదర్శన్, రాజా, ఆదర్శ్, బ్రహ్మాజీ, ప్రవీణ్ వారి వారి పాత్రల్లో బాగా నటించారు.
టెక్నీకల్ హైలెట్స్ :
రణరంగం సినిమాకు ప్రధాన ఆకర్షణ టెక్నీకల్ టీమ్. ఒక టెక్నీకల్ టీమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటె ఆ సినిమా ఏ స్థాయి లో ఉంటుందో రణరంగం ప్రూవ్ చేసింది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అదిరింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను నేపధ్య సంగీతం నిలబెట్టింది. పాటలు పరవాలేదు. ఇక దివాకర్ మణి అందించిన విజువల్స్ సూపర్బ్. కథను నడిపించే విషయంలో ఫోటోగ్రఫి ప్రధాన పాత్ర పోషించింది, కథలో ఉన్న మూడ్ ని చక్కగా పోట్రెట్ చేసింది. ఆర్ట్ సూపర్ .. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సుధీర్ వర్మ గురించి చెప్పాలంటే .. ఓ సాధారణ కథను ఆసక్తిగా సరికొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేసాడు. ఇప్పటికే ఈ తరహా కథలు చాలా చూసాం .. కానీ ఈ తరహా కొత్త కథనాలు మాత్రం రాలేదు. గ్యాంగ్ స్టార్ కథను ఎంచుకున్న దర్శకుడు దాన్ని నడిపించే విధానంలో కన్ఫ్యూజ్ అయ్యాడు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.
విశ్లేషణ :
రణరంగం సినిమా విషయంలో దర్శకుడు టెక్నీకల్ టీమ్ పై పెట్టిన ఆసక్తి సినిమా కథ మీద పెట్టి ఉంటె ఇంకా బాగుండేది. ఏమాత్రం ఆకట్టుకొని కథను తీసుకుని 90 వ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు. అయితే అందులో చాలా వరకు అసహజమైన సన్నివేశాలు కాస్త బోర్ కొట్టిస్తాయ్. శర్వానంద్ నటన, కాజల్ గ్లామర్, టెక్నీకల్ హైలెట్స్ సినిమాకు ప్లస్ అంశాలు అయితే .. కొత్తదనం లేని కథ, ఆసక్తికలిగించని కథనం .. నిరాశ పరిచే అంశాలైతే .. ప్రధాన ఆకర్షణ మాత్రం రి రికార్డింగ్. గాడ్ ఫాధర్ సినిమా స్ఫూర్తి అని చెప్పుకున్న దర్శకుడు ఈ సినిమా విషయంలో మాత్రం ఏమాత్రం ఆసక్తి కలిగించని అంశాలతో విసిగించాడు. ఒక మాములు కుర్రాడు .. గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదిగాడన్న ఆసక్తి తో చూద్దామంటే దానికి ఎక్కడ సమాధానం దొరకదు.
ట్యాగ్ లైన్ : కథ పాతదే .. కానీ !