అందం శరీరానికి సంబంధించినది కాదు.. మనసుకు సంబంధించినదని చాలామంది చెబుతుంటారు. కానీ, అంతఃసౌందర్యాన్ని గేలి చేస్తూ, బాహ్య సౌందర్యం మీద ఎనలేని ప్రేమ చూపిస్తుండడం సర్వసాధారణమైపోయింది. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఓ యువతి విశ్వ సుందరిగా కిరీటాన్ని అందుకుంది. ‘నన్ను చూడండి.. నా అందాన్ని చూడండి.. మీలో వున్న అందాన్ని గుర్తించండి..’ అంటూ తనలాంటివారికి విశ్వ సుందరి పోటీల వేదికగా సూచించింది.
ఈ ఏడాది విశ్వ సుందరిగా ఎంపికైన జోజిబిని టుంజీ దక్షిణాఫ్రికాకి చెందిన యువతి. 26 ఏళ్ళ టుంజీ, పోటీల్లో పాల్గొన్న 89 మందిని కిందికి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకుంది అందాల పోటీల్లో. ఆమె రంగు నలుపు.. ఆమె జుట్టు కూడా సోకాల్డ్ అందాల లెక్కలకు భిన్నం. కానీ, ఆమె ఆత్మవిశ్వాసం.. ఓ అద్భుతం. విశ్వ సుందరి కిరీటం గెల్చుకున్నాక ఆమె చెప్పిన మాటలే ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక.
ప్రపంచ వ్యాప్తంగా వర్ణ వివక్ష కొనసాగుతోందన్నది నిర్వివాదాంశం. నల్ల జాతీయులపై దాడుల గురించి ఎప్పటికప్పుడు వింటూనే వున్నాం. ‘నా రంగు, నా జుట్టుని చూసి ఎవరూ అందంగా వుందని అనరు. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. ఇక అలాంటి వివక్షకు ముగింపు పలికే సమయం ఇదే..’ అని జోజిబిని టుంజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి. ఇదిలా వుంటే, భారతదేశానికి చెందిన పర్తికా సింగ్, మిస్ యూనివర్స్ పోటీల్లో టాప్ 20లో కూడా చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.
753191 358803hello admin, your website pages pattern is simple and clean and i like it. Your articles are wonderful. Remember to keep up the great work. Greets.. 171290