మమ్ముట్టి ‘భ్రమయుగం’ ను తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,094FansLike
57,764FollowersFollow

లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘భ్రమయుగం’ తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది.

కొందరు నటులు తమ నటనా నైపుణ్యంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ నటుడే. ఆయన నటించిన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మమ్ముట్టి తాజా చిత్రం ‘భ్రమయుగం’ కూడా అలాగే అందరి దృష్టిని ఆకర్షించింది.

నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్‌ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా యొక్క వైవిధ్యమైన కథాంశానికి, ఇందులోని మమ్ముట్టి అద్భుతమైన నటనను ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు కురిశాయి.

మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు కూడా అద్భుతంగా నటించి మెప్పించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు వెండితెరపై ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది.

రచయిత-దర్శకుడు రాహుల్ సదాశివన్, సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్, ఆర్ట్ డైరెక్టర్ జోతిష్ శంకర్, సంగీత దర్శకుడు క్రిస్టో జేవియర్, ఎడిటర్ షఫీక్ మహమ్మద్ అలీ, సౌండ్ డిజైనర్ జయదేవన్ చక్కాడత్, ఫైనల్ మిక్స్ ఇంజనీర్ ఎం.ఆర్. రాజాకృష్ణన్.. ఇలా చిత్ర బృందమంతా మనసుపెట్టి పనిచేసి, సమిష్టి కృషితో అద్భుతమైన అవుట్ పుట్ ని అందించారు.

మలయాళం భాషలో ఇప్పటికే ‘భ్రమయుగం’ చిత్రాన్ని వీక్షించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు.. ఇది ప్రతి సినీ ప్రియుడు తప్పక చూసి అనుభూతి చెందాల్సిన సినిమా అని చెబుతున్నారు.

విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తున్న సూర్యదేవర నాగ వంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ అద్భుతమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ‘లియో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని విడుదల చేసిన సితార సంస్థ.. ఇప్పుడు ‘భ్రమయుగం’ తెలుగు వెర్షన్ ను ఫిబ్రవరి 23న విడుదల చేస్తోంది.

10 COMMENTS

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 13 సంవత్సరాల లోపు బాలలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు...

చరణ్ విషయంలో తారక్ సైలెన్స్ ఎందుకు?

ఒకప్పుడు “రామ్ చరణ్ బర్త్‌డే అంటే రాత్రి 12 గంటలకు వాళ్ల ఇంట్లో ఉంటా… తప్పకుండా విష్ చేస్తా” అని చెప్పిన తారక్ మాటలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి....