Switch to English

సినిమా రివ్యూ: మామాంగం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

నటీనటులు: మమ్ముట్టి, ఉన్ని ముకుందన్, అచ్యుతన్, తరుణ్ అరోరా,
నిర్మాత: వేణు కున్నప్పిళ్ళై
దర్శకత్వం: ఎం. పద్మకుమార్
సినిమాటోగ్రఫీ: రాజ్ పిళ్ళై
మ్యూజిక్: ఎం. జయచంద్రన్
ఎడిటర్‌: రాజా మొహమ్మద్
విడుదల తేదీ: డిసెంబర్ 12, 2019

‘యాత్ర’ లాంటి డైరెక్ట్ సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నుంచి వస్తున్న పీరియడ్ వార్ ఫిల్మ్ ‘మామాంగం’. కేరళలో చాలా గ్రేట్ గా జరిగే ‘మామాంగం’ అనే ఫెస్టివల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సినిమాని గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అల్లు అరవింద్ తెలుగు రిలీజ్ చేశారు. సౌత్ లోని నాలు భాషలతో పాటు హిందీలో కూడా రిలీజైన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

దేవుడు అనేదానికి వ్యతికరేకమైన రాజ్యం సముద్రిలది.. అలాగే దేవుడిని నమ్మే రాజ్యం చవేరిలది.. ఒక సమయంలో సముద్రి రాజ్యానికి చెందిన వారు చవేరిల మీద దండెత్తి వారి రాజ్యం మీదకి వస్తున్నారని తెలుస్తుంది. ఆ టైంలో చవేరిల తరపున మమ్ముట్టి యుద్దానికి వెళ్ళి, కనపడకుండా పోతాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి చవేరిలకి అదే సందర్భం ఎదురవుతుంది. అప్పుడు ఉన్ని ముకుందన్ మరియు అచ్యుతన్ కలిసి సముద్రిలపైయుద్దానికి వెళ్తారు. అక్కడ వీరికి మమ్ముట్టి ఎలా ఎదురు పడ్డాడు? ఎలా సహాయ పడ్డాడు? అసలు అన్ని రోజులు అతను ఎందుకు మిస్సింగ్? మమ్ముట్టి ఉన్ని మరియు ఆ బాలుడికి ఎలాంటి సాయం చేసాడు? అసలు మమ్ముట్టి సముద్రలను పూర్తిగా అంతమొందించాడా? లేదా? అసలు మమ్ముట్టి కథ ఏమిటి ? అన్నదే అసలైన ‘మామాంగం’ కథ..

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఇదొక మలయాళీ సినిమాకి డబ్బింగ్ చిత్రం. ఆ పరంగా చూసుకుంటే మనకు కాస్తో కూస్తో పరిచయమున్నది మమ్ముట్టి మరియు ఉన్ని ముకుందన్.. వీరిద్దరూ నటన పరంగా చాలా బాగా చేశారు. అలాగే మరో కీ రోల్ చేసిన అచ్యుతన్ నటన ఆన్ స్క్రీన్ పరంగా సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఇక మిగిలిన నటీనటులు కూడా బాగా చేశారు.

ఇక సినిమా పరంగా మనకు అదిరింది అనిపించే సీన్స్.. సినిమా మొదట్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ లో సుమారు 5 నిమిషాలపైన సాగే యాక్షన్ ఘట్టం చాలా బాగున్నాయి.

ఆఫ్ స్క్రీన్:

ఈ సినిమాకి మూడు డిపార్ట్మెంట్స్ వారు అద్భుతమైన పనితీరుని కనబరిచారు. అందులో మొదటగా రాజ్ పిళ్ళై సినిమాటోగ్రఫీ మరియు మోహన్ దాస్ ప్రొడక్షన్ డిజైనింగ్ మనకు దృష్యానందాన్ని కలిగిస్తే, జయచంద్రన్ – సంచిత్ బల్హారా – అంకిత్ బల్హారాల మ్యూజిక్ మనకి శ్రవణానందాన్ని కలిగిస్తుంది. ఈ మూడు డిపార్ట్మెంట్స్ వారు సినిమాని నిలబెట్టడానికి ది బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చారు.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఆన్ స్క్రీన్ పరంగా పెద్దగా తెలిసిన నటీనటులు లేకపోవడం మొదటి మైనస్.. అలాగే ఈ సినిమా మన నేటివిటీకి చాలా దూరంగా అనిపించడం. పోనీ నేటివిటీ అటు ఇటైనా సినిమాలో కంటెంట్ ఉందా? బోర్ కొట్టకుండా సినిమాని నడిపించాడా ? అంటే అదీ లేదు. అందుకే సినిమా చాలా అంటే చాలా బోరింగ్ గా సాగుతుంది. చాలా మంది మధ్యలోనే లేచిపోయారు అంటే మీరే అర్తమ చేస్కోండి ఎంత స్లో అండ్ బోరింగ్ గా ఉందనేది.. ఇకపోతే సినిమాలో తీసుకున్న పాయింట్ కూడా చాలా పాతది, అంతే కాకుండా అంట ఎఫెక్టివ్ గా కూడా చెప్పలేదు.

ఆఫ్ స్క్రీన్:

ఈ సినిమా కోసం సజీవ పిళ్ళై రాసిన కథ చాలా ఓల్డ్ అని చెప్పాలి. సరే ఆ కథని ఎంగేజింగ్ గా రాసుకున్నారా అంటే అదీ లేదు. ముఖ్యంగా ఇరు వర్గాల మధ్య సమస్యని సరిగా చెప్పలేదు, అలాగే పాత్రల మధ్య ఎమోషన్స్ ని సరిగా రాసుకోలేదు. దాంతో హీరో ఎమోషన్, హీరో దేని కోసం పోరాడుతున్నాడు అనే కిక్ ఆడియన్స్ కి కలగలేదు. దాంతో బోర్ ఫీలయ్యారు. కథనాన్ని కూడా కంప్లీట్ జర్నీ బేస్డ్ గా రాసుకోవడం అదేమో ముందుకు సాగకుండా, స్లోగా నడవడం వలన ప్రేక్షకులు నిద్రపోయారు. ఇక డైరెక్టర్ మలయాళం పరంగా బెటర్ అని చెప్పచ్చు కానీ తెలుగు ఆడియన్స్ పరంగా చూసుకుంటే డైరెక్టర్ ది బెస్ట్ మోమెంట్స్ అనేవి నాలుగైదు కూడా ఇవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి కానీ ఆ విలువకి సమానమైన కథ కథనాలు లేవు. రాజా మొహమ్మద్ ఎడిటింగ్ కూడా బాలేదు.

విశ్లేషణ:

మలయాళ చిత్ర సీమలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా ‘మామాంగం’ – తీసిన వారికి చెప్పుకోవడానికి బిగ్ బడ్జెట్ ఫిలిం అనేదన్నా ఉంది, కానీ డబ్బు పెట్టి చుసిన ప్రేక్షకులు ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం వారికి నిరాశని కలిగిస్తుంది. విజువల్స్, కొన్ని సెట్స్, మ్యూజిక్, నటీనటుల నటన బాగున్నా, సినిమాకి అసలు హీరో అయిన కథ బాలేకపోవడం, కథనం అంతకన్నా బోరింగ్ గా ఉండడం, హై మోమెంట్స్ లేకపోవడం సినిమాని బోర్ ఫీలయ్యేలా చేస్తుంది. మలయాళ నేపధ్యం, స్లో టేకింగ్, విజువల్స్, లెస్ ఎమోషన్స్, మమ్ముట్టి స్టార్డం అనేవి మలయాళీ ప్రేక్షకులకి నచ్చే అవకాశం ఉంది కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ‘మామాంగం’ లాంటి సినిమా అంతగా ఎక్కదు.

ఫైనల్ పంచ్: ‘మామాంగం’ – విషయం లేని బిగ్ బడ్జెట్ ఫిల్మ్.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1.5/5

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...
నటీనటులు: మమ్ముట్టి, ఉన్ని ముకుందన్, అచ్యుతన్, తరుణ్ అరోరా, నిర్మాత: వేణు కున్నప్పిళ్ళై దర్శకత్వం: ఎం. పద్మకుమార్ సినిమాటోగ్రఫీ: రాజ్ పిళ్ళై మ్యూజిక్: ఎం. జయచంద్రన్ ఎడిటర్‌: రాజా మొహమ్మద్ విడుదల తేదీ: డిసెంబర్ 12, 2019 'యాత్ర' లాంటి డైరెక్ట్ సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నుంచి వస్తున్న పీరియడ్ వార్ ఫిల్మ్ 'మామాంగం'. కేరళలో చాలా గ్రేట్ గా...సినిమా రివ్యూ: మామాంగం