Switch to English

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

నటీనటులు: అజ్మల్ అమీర్, అలీ, బ్రహ్మానందం,
నిర్మాతలు : నట్టి క్రాంతి, నట్టి కరుణ
దర్శకత్వం: సిద్దార్థ తాతోలు రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి
మ్యూజిక్: రవి శంకర్
ఎడిటర్‌: అన్వార్ అలీ
విడుదల తేదీ: డిసెంబర్ 12, 2019

ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసి, ఇప్పుడు వివాదాస్పద చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో రూపొందిన సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. మొదట ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ తో మొదలై నవంబర్ 29న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా టైటిల్ వివాదంలో ఇరుక్కొని ఫైనల్ గా టైటిల్ చేంజ్ చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ శిష్యుడు సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్ని వివాదాలకు తెరలేపేలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

కథ:

ఆర్జీవీ చెప్పిన దాని ప్రకారం ఇదొక కల్పిత కథ.. కానీ అదేంటో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే.. రూలింగ్ పార్టీ అయిన వెలుగు దేశం పార్టీని గద్దె దింపి అత్యధిక మెజారిటీతో విఎస్ జగన్నాథరెడ్డి(అజ్మల్ అమీర్) పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ తక్కువ రోజుల్లోనే విఎస్ జగన్నాథరెడ్డి పార్టీ నాయకుల ఫ్యాక్షనిజం వలన పార్టీపై ప్రజల్లో నమ్మకం పోతుంది. అదే టైంలో వెలుగు దేశం పార్టీ దేవినేని రమని విజయవాడ మెయిన్ రోడ్ లో మర్డర్ చేస్తారు. ఇక అక్కడి నుంచి ఆ మర్డర్ ఎవరు చేశారు? ఎవరు చేయించారు? ఎందుకు చేయించారు? ఈ మర్డర్ కారణంగా మధ్యంతర ఎన్నికలు ఎలా వచ్చాయి? ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఆర్జీవీ కల్పిత పాత్రలు, కల్పిత కథకి మన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిస్థితులకి భలే దగ్గర పోలికలు ఉన్నాయి, చెప్పాలంటే మక్కికి మక్కి కాపీ కొట్టినట్టు ఉంటుంది. అదే ఈ సినిమాకి ప్రేక్షకులు రావడానికి ఉపయోగపడిన మొదటి ప్లస్ పాయింట్. అలాగే ఆ పాత్రలకి ఎంచుకున్న నటులు, నిజ జీవిత పాత్రలకి జెరాక్స్ కాపీలా ఉండడం కూడా ప్లస్ అయ్యింది. ఇక సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే పప్పు సాంగ్ లోని కొన్ని మోమెంట్స్ నవ్విస్తాయి. ఇక ఇంటర్వల్ బ్లాక్ అయిన దేవినేని రమ మర్డర్ సీన్ బాగుంది. కెఏ పాల్ స్ఫూర్తిగా కనిపించే పిపి చాల్ పాత్ర సెకండాఫ్ లో నవ్విస్తుంది. ఈయన రెండు మూడు సన్నివేశాలే సెకండాఫ్ లో రిలాక్సింగ్ గా అనిపిస్తాయి. మిగతా అంటా బాబోయ్ నేను చెప్పలేను..

విఎస్ జగన్నాథరెడ్డి పాత్రలో నటించిన అజ్మల్ అమీర్ నటన బాగుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.

ఆఫ్ స్క్రీన్:

జగదీశ్ చీకటి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే కొన్ని చోట్ల నేపధ్య సంగీతం కూడా బాగుంది. అలాగే ఈ చిత్ర కాస్టింగ్ డైరెక్టర్ గ్రేట్ అని చెప్పాలి, ఎందుకంటే ప్రతి పాత్రకి పర్ఫెక్ట్ జెరాక్స్ కాపీ లాంటి వారిని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఒక్కటీ లేదు. అలాగే మనం పొద్దున లేచినప్పటినుంచీ చూస్తూ ఉండే అదే రాజకీయాల లొల్లిని మళ్ళీ ఒక స్పూఫ్ లా చేశారే తప్ప, మనకి తెలియనిది ఎదో చెప్పాడు అనేలా ఏం లేదు. అలాగని స్పూఫ్ అంటే ఇదేదో పొలిటికల్ కామెడీ అనుకునేరు, కానీ కాదు.. అలా అని సీరియస్ సినిమాకాదు. ఇదొక బక్వాస్ బొమ్మ.

ఆఫ్ స్క్రీన్:

ఆర్జీవీ తన టాలెంట్ ని ఎప్పుడో పక్కన పెట్టేసి, మాటలు చెప్పుకుంటూ, కేవలం వివాదాన్ని టార్గెట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అదే పరంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలని చూసి క్యాష్ చేసుకోవచ్చని చేసిన సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రూలింగ్ పార్టీ లీడర్ కి కంప్లీట్ సపోర్ట్ లా, కేసుల్లో తన తప్పే లేదని గ్రీన్ చిట్ ఇవ్వాల్సిన కాండిడేట్ అని చెప్పేలా చేసిన ప్రయత్నంలా ఉంటుంది. కథ పరంగా దేవినేని రమ మర్డర్ కేస్ ని పెట్టుకొని, దాని చుట్టూ చెత్త కాదు కాదు పరమ చెత్త సీన్స్ వేసుకొని కథ అల్లు కున్నారు. సినిమాలో చూసే అన్ని సీన్స్ మనం రోజూ పేపర్ మరియు టీవీల్లో చూస్తూనే ఉన్నాం , అందుకే ఎక్కడా ఇంటరెస్ట్ ఉండదు.

ఇకపోతే, కథనం అయితే ఇంకా వరస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్ చాలా వరస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా అనేది పూర్తిగా తెలియని వాళ్ళు కూడా షార్ట్ ఫిలిమ్స్ బెటర్ గా స్క్రీన్ ప్లేస్ రాసుకుంటున్నారు కానీ తెలుగు హిందీలో బెస్ట్ మేకర్ అనుకునే ఆర్జీవీ అండ్ టీం ఇలాంటి చెత్త కథ – కథనాలతో సినిమా చేయడం ఫిల్మ్ ఇండస్ట్రీకి బిగ్ బాడ్ అచీవ్ మెంట్ గా చెప్పుకోవచ్చు. ఇక సిద్దార్థ్ తాబేలు డైరెక్షన్ కూడా అంతంత మాత్రమే. ఎడిటర్ సెకండాఫ్ లో ఒక రెండు సీన్ ల తర్వాత కట్ చేసి క్లైమాక్స్ పెట్టినా పెద్ద తేడా ఉండదు. అంతలా సెకండాఫ్ లాగ్ ఉంది. ఎందుకంటే సెకండాఫ్ లో కథే లేదు, కథనం అంతకన్నా లేదు. ఇక డైరెక్టర్, ఎడిటర్ ఏం చేస్తారులే..

విశ్లేషణ:

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ఆర్జీవీ ఇంటర్వ్యూతో ముగుస్తుంది. అదే పాయింట్ చెప్పి, దానికి ఈ సినిమాని పోల్చి విశ్లేషణ ముగిస్తా.. ‘ సినిమా అయినా, రాజకీయమైనా, టీవీ అయినా, గేమ్స్ అయినా, ఇలా ఏదైనా ప్రజలు కోరుకునేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే – ఆర్జీవీ’.. దీని ప్రకారం చూసుకుంటే.. మరి మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఆర్జీవీ గారూ.. ఆర్జీవీ కేవలం టైటిల్ అండ్ ఆర్టిస్టులని ప్రస్తుత ఏపీ రాజకీయాలకు, నేతలకు దగ్గరగా పెట్టుకొని బిజినెస్ పరంగా ఈజీ క్యాష్ రాబట్టుకునే ఒక చీప్ ట్రిక్కే ఈ సినిమా తప్ప, ప్రేక్షకులకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వని పరమ చెత్త మరియు బోరింగ్ సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’

ఫైనల్ పంచ్: అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు – సినిమా రూపంలో ప్రేక్షకులకి ఆర్జీవీ వెన్నుపోటు.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...
నటీనటులు: అజ్మల్ అమీర్, అలీ, బ్రహ్మానందం, నిర్మాతలు : నట్టి క్రాంతి, నట్టి కరుణ దర్శకత్వం: సిద్దార్థ తాతోలు రామ్ గోపాల్ వర్మ సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి మ్యూజిక్: రవి శంకర్ ఎడిటర్‌: అన్వార్ అలీ విడుదల తేదీ: డిసెంబర్ 12, 2019 ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసి, ఇప్పుడు వివాదాస్పద చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో రూపొందిన సినిమా 'అమ్మ రాజ్యంలో కడప...'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' మూవీ రివ్యూ