బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా మరియు యంగ్ హీరో అర్జున్ కపూర్లు ప్రేమలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. మలైకా కంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ ఆమెతో చాలా కాలం క్రితం నుండే చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అర్జున్ కపూర్‌తో ప్రేమ కారణంగానే భర్త అర్జన్ ఖాన్‌కు మలైకా అరోరా విడాకులు ఇచ్చిందనే వాదన కూడా వినిపిస్తుంది. 19 ఏళ్ల వివాహ బంధంకు మూడు సంవత్సరాల క్రితం ఫుల్ స్టాప్ పెట్టిన మలైకా అరోరా త్వరలోనే అర్జున్ కపూర్‌ను వివాహం చేసుకోబోతున్నట్లుగా వెళ్లడి చేసింది.
తాజాగా ఆన్ లైన్ ద్వారా ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన మలైక అరోర పలు విషయాల గురించి స్పందించింది. అర్జున్ కపూర్‌తో ప్రేమ మరియు పెళ్లి విషయమై తనకు ఎలాంటి హడావుడి లేదని చెప్పింది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా నా పెళ్లి అవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రశ్నలు అసందర్బం అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. మీడియాలో తన గురించి పదే పదే ఏవో పుకార్లు వస్తున్నాయి. వాటన్నింటికి నేను పదే పదే క్లారిటీ ఇవ్వలేను అంది. అదే సమయంలో పిల్లల విషయంలో ప్రశ్నించిన సందర్బంగా మౌనం వహించింది. పిల్లలు ప్రస్తుతం అర్భజ్ ఖాన్ వద్ద ఉంటున్నట్లుగా ఆమె మౌనంను బట్టి అర్థం చేసుకోవచ్చు. మలైకా అరోరా తీరుపై బాలీవుడ్ వర్గాల వారు మాత్రమే కాకుండా ఆమె సన్నిహితులు కూడా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
310978 882321Totally composed written content material , thanks for details . 404213