Switch to English

మహేష్‌ ‘సరిలేరు’కి చెక్కుడు పూర్తవలేదట!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ హీరోగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా అనౌన్స్‌మెంట్‌ జరిగిపోయిన విషయం విదితమే. ‘మహర్షి’ రిలీజ్‌ తర్వాత ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‌ని విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్న మహేష్‌, విదేశాల నుంచి తిరిగి రాగానే, సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందంటూ వార్తలొస్తున్నాయి. విజయశాంతి చాలాకాలం తర్వాత ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్బబోతోంది. బండ్ల గణేష్‌ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కన్పిస్తాడు. హీరోయిన్‌గా రష్మిక మండన్న పేరు ఖరారైపోయింది.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వుంటుందంటూ వార్తలొస్తున్నాయి. ఆర్మీ మేజర్‌గా మహేష్‌ కన్పించబోతున్నాడని, సినిమాలో హీరో హీరోయిన్ల పరిచయం ట్రైన్‌ జర్నీతో స్టార్ట్‌ అవుతుందనీ లీకులు బయటకొస్తున్నాయి కూడా. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకి ఇంకా ‘చెక్కుడు’ పనులు పూర్తి కాలేదట. పక్కాగా స్క్రిప్ట్‌ రెడీ అయితేనే తప్ప ఏ సినిమాకీ ఓకే చెప్పనని ఇటీవల పలు సందర్భాల్లో మహేష్‌ చెప్పాడుగానీ, అనిల్‌ రావిపూడి పూర్తి చేసిన కథకి, కొన్ని బెటర్‌మెంట్స్‌ని మహేష్‌ సూచించాడనీ, అవన్నీ ఇంకా అలా అలా జరుగుతూనే వున్నాయనీ తెలుస్తోంది.

తాజాగా, విజయశాంతి పాత్రకు సంబంధించి కొంత ప్యాచప్‌ చేస్తున్నారట.. అదీ స్క్రిప్ట్‌లో. అదే నిజమైతే, మొత్తం స్క్రిప్ట్‌లో రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు జరగొచ్చేమో. ఇదిలా వుంటే, ఫలానా పాత్ర తీరు తెన్నులిలా వుంటాయి.. హీరోయిన్ల పరిచయం ఇదీ.. హీరో క్యారెక్టర్‌ ఇలా వుంటుంది.. అంటూ మీడియాకి లీకులు అందడం పట్ల సూపర్‌ స్టార్‌ మహేష్‌ చాలా సీరియస్‌గా వున్నాడంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. అదంతా ఉత్తదేనంటూ ఆ తర్వాత ఓ వివరణ ఆఫ్‌ ది రికార్డ్‌గా బయటకొచ్చింది. ఇప్పుడేమో ఈ ‘చెక్కుడు’ వ్యవహారాల గురించి లీకులు బయటకొస్తున్నాయి.. మళ్ళీ దీనికి ఇంకో ఖండన అనధికారికంగానే అయినా వస్తుందేమో.

సినిమా లాంఛనంగా ప్రారంభమయిపోయినా, షూటింగ్‌ ఎప్పుడు షురూ అవుతుందోగానీ.. అప్పటిదాకా ఈ చెక్కుడు వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చేలా కన్పించడంలేదు. మరోపక్క, మహేష్‌ సినిమా అంటే.. అది నిర్మాణంలో వుండగా మరిన్ని చెక్కుడు సంగతులుంటాయన్న బలమైన వాదన సినీ పరిశ్రమలో వుండనే వుంది. ఆ కారణంగానే ‘మహర్షి’ విడుదల అనుకున్నదానికంటే చాలా లేట్‌ అయ్యింది. మరి, అనిల్‌ విషయంలో మహేష్‌ ఏం చేస్తాడో చూడాలిక.

Related Posts

సాహో ట్రైలర్ వచ్చేస్తోంది

పెళ్ళి గురించి తాప్సి షాకింగ్ కామెంట్స్

లేటెస్ట్ హాట్ ఫొటోస్ : వాణి కపూర్

నేహా మాలిక్ బికినీ షో

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...