రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం చెప్పిన కథ డెవిల్ అని, అయితే అది ఇప్పుడు స్టేల్ అయిపోయిందని, యానిమల్ స్టోరీ కాదని చెప్పుకొచ్చాడు. అయితే ప్రేక్షకులు మాత్రం బలంగా ఫిక్స్ అయ్యారు. యానిమల్ స్టోరీ మహేష్ రిజెక్ట్ చేసాడు అని చెప్పడం ఇష్టం లేక ఇలా మార్చాడు సందీప్ రెడ్డి వంగా అని.
ఒకవేళ యానిమల్ స్టోరీ మహేష్ చేసి ఉంటె ఎలా ఉండేది అన్న ఆలోచన మహేష్ ఫ్యాన్స్ కి వస్తుంటేనే భయపడిపోతున్నారు. ఇందులో రన్బీర్ బూతులు మాట్లాడతాడు, పెళ్ళాన్ని కొడతాడు కొట్టించుకుంటాడు, న్యూడ్ గా తిరుగుతాడు… విపరీత ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చేయడం ఇష్టం లేకే మహేష్ ఈ చిత్రాన్ని వదులుకున్నాడా?
ఏదేమైనా మహేష్ ను ఇలాంటి రోల్ లో అభిమానులు అస్సలు చూడలేరు అన్నది నిజం. అలా అని మహేష్ కోసం యానిమల్ ఇంటెన్సిటీను టోన్ డౌన్ చేస్తే చిత్రం ఈ రేంజ్ లో విజయం సాధించదు.