న్యాచురల్ స్టార్ నాని నటించిన హై నాన్న చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేయగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక కీలకమైన కూతురి పాత్రలో కియారా ఖన్నా కనిపిస్తుంది. ప్రోమోలు చూస్తే పూర్తిస్థాయి ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ సినిమా అనిపించక మానదు. దానికి తగ్గట్లే చిత్ర బృందం కూడా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
నాని అనగానే న్యాచురల్ పెర్ఫార్మర్. అందుకే న్యాచురల్ స్టార్ అని అంటాం. హై నాన్నలో గుండెలు పిండేసే సీన్స్ రెండు మూడిట్లో మన నాని జీవించేసాడట. ఇకపోతే నాని కాకుండా మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నాలు కూడా తమ పాత్రలను అద్భుతంగా పండించినట్లు తెలుస్తోంది.
మృణాల్ ఠాకూర్ అయితే ఈ సినిమా సరిగా ఆడకపోతే నా పేరు మార్చుకుంటా అని భారీ స్టేట్మెంట్ లు ఇచ్చేస్తోంది.