ఇప్పుడీ కొత్త స్ట్రాటజీ ప్రేక్షకులకు భలే కిక్ ను ఇస్తోంది. సీన్ మీద ఒక ఇంటెన్స్ ఫైట్ జరుగుతూ ఉంటుంది, లేదా ఒక థ్రిల్లింగ్ మూమెంట్ నడుస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక క్లాసిక్ ఓల్డ్ సాంగ్ ప్లే అవుతుంది. అలాంటి సీన్స్ కు నరాలు తెగేలాంటి బీజీఎమ్ ను ఊహిస్తారు ప్రేక్షకులు. దానికి భిన్నంగా యువ దర్శకులు ఆలోచిస్తున్నారు.
రీసెంట్ గా హిట్ అయిన లియోను తీసుకోండి. కేఫ్ ఫైట్ లో ఇంటెన్స్ ఫైట్ మధ్య క్లాసిక్ తమిళ్ పాట వస్తుంది. అదే లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన విక్రమ్ లో కూడా అంతే.
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిలో పాత ఎన్టీఆర్ సాంగ్ కు దానికి అనుగుణంగా ఫైట్ ను కంపోజ్ చేయించాడు అనిల్ రావిపూడి. అది కూడా భలే పేలింది. వీటిన్నంటి కంటే ఒక ఆకు ఎక్కువే చదివింది యానిమల్.
క్లైమాక్స్ ఫైట్ లో ఒక కొడుకు తండ్రి కోసం ఏం చేస్తాడో చెబుతూ సాంగ్ రావడం అనేది భలే పేలింది. ఈ రకమైన స్ట్రాటజీ ఇంకా ఎన్ని సినిమాల్లో వస్తుందో చూడాలి.