టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర పర్యటన ఖరారైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఈమేరకు నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని కార్యకర్తలతో అన్నారు. మొత్తంగా 400 రోజుల పాటు 4 వేల కి.మీ పాదయాత్ర ఉంటుందని లోకేశ్ అన్నారు.
పాదయాత్రను చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. మంగళగిరిలో 4రోజులపాటు పాదయాత్ర ఉంటుందని తెలిపారు. మిగిలిన రోజుల్లో రాష్ట్రమంతటా పర్యటిస్తానని వెల్లడించారు. తనను ఓడించేందుకు సీఎం జగన్ వాడే అన్ని ఆయుధాలను ధీటుగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మంగళగిరిలో ఈసారి టీడీపీ జెండా ఎగరాలని కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచే కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. చంద్రబాబునాయుడు 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయడంతో ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
my normal comment is