విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ సినిమా సాధించిన విజయం తర్వాత విజయ్ బీస్ట్ చేసాడు. లోకేష్, కమల్ హాసన్ తో విక్రమ్ ను డైరెక్ట్ చేసాడు. విక్రమ్ జూన్ 3న విడుదల కాబోతోంది. ప్రస్తుతం విజయ్ తన 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక విక్రమ్ సినిమాను ప్రమోట్ చేస్తోన్న లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ చిత్రాన్ని కన్ఫర్మ్ చేసాడు.
తన తర్వాతి చిత్రం విజయ్ హీరోగా ఉంటుందని ప్రకటించాడు. సో విజయ్ 67వ చిత్రాన్ని లోకేష్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ వార్తతో విజయ్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీ.