Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 22 మే 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:31
సూర్యాస్తమయం: సా.6:27
తిథి: వైశాఖ బహుళ సప్తమి రా.6:01వరకు తదుపరి వైశాఖ బహుళ అష్టమి
సంస్కృతవారం: భానూవాసరః (ఆదివారం)
నక్షత్రము: ధనిష్ఠ.రా.తె.3:31 వరకు తదుపరి శతభిషం
యోగం: బ్రహ్మం.ఉ.10:18 వరకు తదుపరి ఐంథ్రం
కరణం: భధ్ర:ఉ.7:00 వరకు
వర్జ్యం:ఉ.7:55 నుండి 9:28 వరకు
దుర్ముహూర్తం: సా.4:25 నుండి 5:13 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:26 నుండి 5:02 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:10 నుండి 4:58 వరకు
అమృతఘడియలు: సా.5:39 నుండి రా. 7:10 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:47 నుండి మ.12:38 వరకు

ఈ రోజు (22-05-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

 

మేషం: చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకోని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఉన్నతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

వృషభం: నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి నూతన వస్తు వాహన లాభాలున్నవి. చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా కాలంగా వేధిస్తున్న చికాకులు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మిథునం: చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. రుణభారం వలన మానసికంగా స్థిమితం ఉండదు. వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట నూతన సమస్యలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నిలకడగా రాణించలేరు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీ కష్టం వృధా అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభమున్నది.

సింహం: ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు.

కన్య: సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరచి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు.

తుల: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు.

వృశ్చికం: కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులుంటాయి. బంధువుల నుండి ఊహించని ఋణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విషయాలలో భాగస్థులతో విభేదాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

ధనస్సు: అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి వివాదాలకు సంభందించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలను పరిష్కరించుకుంటారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మకరం: జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో అధిక కష్టంతో స్వల్ప ఫలితం పొందుతారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

కుంభం: నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులుతో శుభకార్యాలకు హాజరవుతారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మీనం: ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. బంధువర్గం నుండి వినకూడని మాటలు వినవలసి రావచ్చు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది.ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

లైగర్ ‘పీకే’ పోస్టర్‌ తో పబ్లిసిటీ పీక్స్‌

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. షూటింగ్ ముగిసి నెలలు గడుస్తోంది....

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం...

దిల్ రాజు ప్లాన్ తో ఆ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళం

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు సినిమా ల రిలీజ్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా...

మేజర్‌ కు అక్కడ కూడా బ్రహ్మరథం

అడవి శేష్‌ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్‌ సినిమా విడుదల అయిన ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది....

మహేష్‌ ఇండియాకు వచ్చేది ఎప్పుడు?

సూపర్ స్టార్‌ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మరియు సర్కారు వారి పాట సినిమా లతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ దక్కించుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్‌...

రాజకీయం

ఫాఫం రఘురామ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా,...

యావత్ భారతావని తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు...

అల్లూరి చుట్టూ రాజకీయం.! ఇదా ఆయనకిచ్చే గౌరవం.?

ఓ సినీ కవి, మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా నడి రోడ్డు మీదా.. కరెన్సీ నోటు మీదా.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..’ అంటాడు. మహనీయుల్ని మనం ఎలా చూస్తున్నాం.? అన్న విషయమై...

హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రసంగంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ విసుర్లు, విమర్శలు

సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పలేకపోయారని.. హైదరాబాద్ అందాలు మాత్రం చూసి వెళ్లారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. బీజేపీ బహిరంగ సభ చప్పగా సాగిందని అన్నారు. ధాన్యం...

గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం

ఏపీ పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు ఘన...

ఎక్కువ చదివినవి

‘హ్యాపీ బర్త్ డే’ లో కొత్త ప్రపంచంలో సరికొత్త కామెడీ ఉంటుంది – రితేష్ రానా

మత్తు వదలరా చిత్రంతో క్రేజీ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు రితేష్ రానా నుండి వస్తోన్న సెకండ్ మూవీ హ్యాపీ బర్త్ డే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా జులై...

2004లో జగన్ సీఎం అయ్యుంటే హైదరాబాద్ పరిస్థితేంటో..?: చంద్రబాబు

‘వైఎస్ జగన్ 2004లో సీఎం అయ్యుంటే నాపై కక్షతో ఇప్పటి అమరావతిలా టీడీపీ హయాంలో నిర్మించిన హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, ఐఎస్ బీలను కూల్చేసేవారేమో.. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్...

కేసీఆర్‌, మోడీ స్నేహంకు ఇదే సాక్ష్యం : రేవంత్‌ రెడ్డి

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు ఎత్తక పోవడం పట్ల ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ ఎందుకు కేసీఆర్‌ ను టార్గెట్‌...

ఏపీఎస్ఆర్టీసీ: ప్రయాణికులపై మరోసారి చార్జీల బాదుడు

రెండున్నర నెలల్లోనే ఏపీఎస్ఆర్టీసీ మరోసారి బస్సు చార్జీలు పెంచింది. పెంచిన టికెట్ ధ‌ర‌లు నేటి నుంచే అమ‌ల్లోకి వస్తాయి. ఏప్రిల్ 14న డీజిల్ సెస్ పేరుతో చార్జీలు పెంచి.. ఇప్పుడూ అదే పేరుతో...

స్త్రీ శక్తి వేరు.. మీలాంటి వీర వనితలే మాకు భారత్ మాతలు: పవన్ కల్యాణ్

ఇంటి సమస్యలను సరిదిద్దుకుంటూనే.. సమాజ సేవ కోసం‌ వచ్చిన వీర మహిళలకు ధన్యవాదాలు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన క్రీయాశీలక వీరమహిళల రాజకీయ, అవగాహన...