నాగ శౌర్య, షిర్లే సెటియా లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. పలుమార్లు వాయిదా పడి చివరికి ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.
కథ:
కృష్ణ (నాగ శౌర్య) బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు. అతనికి వ్రింద (షిర్లే సెటియా) అంటే ఇష్టం ఏర్పడుతుంది. కొంత ప్రయత్నించిన తర్వాత ఆమె కూడా కృష్ణ అంటే ఇష్టం పెరుగుతుంది. ఆపై ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తాడు.
ఇక ఆ తర్వాత నుండి వీరిద్దరూ కలిసి వారిద్దరి ఇళ్లల్లో పెళ్లికి ఎలా ఒప్పించారు. దానికి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, పెళ్ళైన తర్వాత ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి అన్నది చిత్ర కథ.
నటీనటులు:
బ్రాహ్మణ పాత్రలో నాగ శౌర్య నటన బాగుంది. చాలా సీన్స్ లో మెచ్యూరిటీ చూపించాడు. ఇక హీరోయిన్ షిర్లే సెటియా జస్ట్ ఓకే అనదగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అంత గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. తమిళ నటుడు అమితాష్ ప్రధాన్ ఈ చిత్రంలో ప్రాజెక్ట్ మేనేజర్ గా కనిపించాడు. ఆయన ఓకే. ఇక రాధికా శరత్ కుమార్ శౌర్య తల్లి పాత్రలో కనిపించి మెప్పించింది.
బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, సత్య తదితరులు కామెడీ రోల్స్ లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ ఇంకా కథ, స్క్రీన్ ప్లే పై వర్క్ చేసుండాల్సింది అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎమోషన్స్, లాజిక్స్ మిస్ అయ్యాయి. స్క్రీన్ ప్లే చాలా చోట్ల ఫ్లాట్ గా సాగుతుంది.
మహతి స్వర సాగర్ సంగీతం జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. తమ్మిరాజు ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది.
పాజిటివ్ పాయింట్స్:
- నాగ శౌర్య
- సెకండ్ హాఫ్ లో వచ్చే డ్రామా
- కొన్ని కామెడీ ట్రాక్స్
నెగటివ్ పాయింట్స్;
- రైటింగ్
- ప్రాజెక్ట్ మేనేజర్ థ్రెడ్
- ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం
- ఫ్లాట్ నరేషన్
విశ్లేషణ:
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా మటుకు ఫ్లాట్ గా నడుస్తుంది. ఆడియన్స్ ఆసక్తి ఇక్కడే సగం చచ్చిపోతుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో డ్రామా బాగుంది. కానీ మొత్తంగా పూర్ రైటింగ్, ఫ్లాట్ స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం చిత్ర ఫ్లో ను దెబ్బతీస్తాయి. మొత్తంగా ఈ సినిమా బిలో యావరేజ్ ఫీల్ కలిగిస్తుంది.
794854 858414Excellent paintings! This is the kind of information that really should be shared about the web. Disgrace on Google for now not positioning this publish upper! Come on more than and talk more than with my site . Thanks =) 827905