నేటి నుండి ప్రారంభం కాబోతున్న టీ20 మెగా టోర్నీలో టీం ఇండియా విజయాలతో దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి వరకు ఐపీఎల్ ఆడి వెంటనే ప్రపంచ కప్ కు సిద్దం అయిన టీం ఇండియా ఆటగాళ్లు ఏ మేరకు ప్రభావం చూపిస్తారు అనేది ఆసక్తిగా మారింది. టీం ఇండియా ఆటగాళ్లు ఒక వైపు ప్రాక్టీస్ చేస్తూనే మరో వైపు ఈ మెగా టోర్నీని జనాల దృష్టిలోకి తీసుకు వెళ్లేందుకు ప్రమోషనల్ వీడియోలను కూడా చేస్తున్నారు. కోహ్లీ మరియు పంథ్ లమద్య తీసిన ఒక వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కోహ్లీ మరియు పంత్ లు వీడియో చాట్ లో ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు.. టీ20ల్లో సిక్లర్లే మ్యాచ్ ను గెలిపిస్తాయి అంటూ కోహ్లీ అనడంతో నువ్వేం కంగారు పడుకు భాయ్ నేను రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతకు ముందు వికెట్ కీపర్ గా ఉన్న వ్యక్తే సిక్స్ కొట్టి ప్రపంచ కప్ ను అందించాడు అంటూ 2011 ప్రకపంచ కప్ ను గురించి గుర్తు చేశాడు అంటూ పంత్ వ్యాఖ్యలు చేశాడు. నిజమే కాని ధోనీ భాయ్ తరహా వికెట్ కీపర్ ఇప్పటి వరకు మనకు లభించలేదు అంటూ కోహ్లీ సరదాగా వ్యాఖ్యనించాడు. నేను కీపర్ నే కదా అంటూ పంత్ వ్యాఖ్యలు చేయగా.. నువ్వు కాకుంటే కీపర్ లు ఇంచా కాలా మంది ఉన్నారు అంటూ మరింత ఫన్ క్రియేట్ చేయడం కోసం కోహ్లీ వ్యాఖ్యలు చేశాడు. అలా వీరిద్దరి మద్య సాగిన వీడియో స్టార్ స్పోర్ట్స్ వారు షేర్ చేశారు.