Switch to English

కేసీఆర్‌ బయోపిక్‌: వర్మ ఆ సెగని తట్టుకోగలడా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow
రామ్‌గోపాల్‌ వర్మ ‘టైగర్‌ కేసీఆర్‌’ టైటిల్‌ని ఎందుకు ముందే ప్రకటించాడు? చేతిలో చేయడానికి చాలా సినిమాలుండగా, టైటిల్‌ని ప్రకటించి, తద్వారా ఎందుకు విమర్శలు ఎదుర్కొంటున్నట్లు? ‘ఆడు’ అనే మాటని కేసీఆర్‌ మీద రామ్‌గోపాల్‌ వర్మ ఎందుకు విసిరాడు? వంటి ఎన్నో ప్రశ్నలు ఇటు సినీ జనాల్నీ, అటు రాజకీయాల్లో వున్న జనాల్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే రామ్‌గోపాల్‌ వర్మ పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో దిట్ట. ఓ సినిమా ప్రమోషన్‌ కోసం ఇంకో సినిమా ప్రకటనని వాడుకుంటాడాయన.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేసుకోలేకపోయిన రామ్‌గోపాల్‌ వర్మ, బహుశా ‘టైగర్‌ కేసీఆర్‌’ సినిమాని కూడా తెలంగాణకే పరిమితం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, టైటిల్‌ లుక్‌తోనే వర్మ ఆంధ్రోళ్ళపై ‘కసి’ ప్రదర్శించేశాడు. తాను ఆంధ్రుడై వుండి కూడా ఆంధ్రోళ్ళకి వ్యతిరేకంగా కేసీఆర్‌ మీద సినిమా తీయాలనుకోవడమే ఆశ్చర్యకరం. కేసీఆర్‌ కూడా ఆంధ్రోళ్ళను మంచోళ్ళుగా చెప్పినాక, ఆంధ్రోళ్ళ గురించి వర్మ నెగెటివ్‌గా మాట్లాడటమంటే ఆయన ఏదో సంచలనం ఆశిస్తున్నాడే విషయం అర్థమవుతోంది.

ఇదిలా వుంటే వర్మ, తాను నటిస్తున్న ‘కోబ్రా’ సినిమా కోసం ‘టైగర్‌ కేసీఆర్‌’ని వాడుకుంటున్నట్లు కన్పిస్తోంది. ‘కోబ్రా’ సినిమాలో వర్మ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇది కరడుగట్టిన మాఫియా లీడర్‌ నయీమ్‌ బయోపిక్‌ అని అనుకోవచ్చు. నయీమ్‌ కొంత కాలం క్రితం తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఆ నయీమ్‌ పాత్ర చుట్టూ కొన్ని సినిమాలూ వచ్చాయి. అయితే, వర్మ కొత్తగా ‘కోబ్రా’ పేరుతో ఏం చేయగలడు? అనే డౌట్‌ చాలామందిలో వుంది.

ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించుకోవాలి. నయీమ్‌పై సినిమా తీయాలని గతంలోనే వర్మ అనుకున్నాడు. అప్పట్లో ఓ టైటిల్‌ కూడా ప్రచారంలోకి వచ్చింది. దాన్ని ఇప్పుడు ‘కోబ్రా’ పేరుతో వర్మ మళ్ళీ ప్రాచుర్యంలోకి తెచ్చాడు. వర్మ ప్రకటించి ఆపేసిన సినిమాల లిస్ట్‌, ఆయన తీసిన సినిమాల లిస్ట్‌ కంటే చాలా పెద్దదిగా కన్పిస్తుంది. అదే రామ్‌గోపాల్‌ వర్మ ప్రత్యేకత. ‘కోబ్రా’ సినిమాలో కొన్ని నిజాల్ని వర్మ చూపించబోతున్నాడనీ, అది తెలంగాణలో అధికార పార్టీకి షాక్‌ ఇవ్వబోతుందని ఊహాగానాలు వినవస్తున్నాయి.

బహుశా, అందుకే వర్మ తెలివిగా ‘టైగర్‌ కేసీఆర్‌’ అంటూ కేసీఆర్‌ని హీరోగా చూపించేందుకు తద్వారా తన ‘కోబ్రా’ సినిమాకి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. ఇలాంటి తెలివితేటలు రామ్‌గోపాల్‌ వర్మకి కాక ఇంకెవరికి వస్తాయి? అయితే, కేసీఆర్‌ని ఇప్పుడెంతగా వర్మ పొగిడినా, ఒక్కసారి విమర్శ అంటూ చేస్తే ఆ తర్వాత కేసీఆర్‌ అభిమానుల నుంచి వర్మకి ఎదురయ్యే తలనొప్పి ఓ రేంజ్‌లో వుంటుంది.

‘ఆడు’ అని ‘టైగర్‌ కేసీఆర్‌’ టైటిల్‌ లుక్ లో ప్రస్తావించడంతోనే కేసీఆర్‌ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు వర్మ. ఏదో తల తిక్క లాజిక్‌ ఒకటి చెప్పి, వర్మ ఇప్పటికి గండం తప్పించుకున్నానని అనుకోవచ్చుగాక. కానీ ‘ఆడు’ అనే మాట విషయంలో కేసీఆర్‌ అభిమానులు సంతృప్తిగా లేరు. చంద్రబాబుని విమర్శించినట్టుండదు, కేసీఆర్‌ని విమర్శిస్తే పరిస్థితి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...