Switch to English

ఔను, శ్రీరెడ్డి నిజంగానే గెలిచింది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆమె స్టార్‌ హీరోయిన్‌ ఏమీ కాదు. గట్టిగా పది సినిమాలు చేసిన అనుభవమూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె పెద్దగా ఎవరికీ తెలీదు. అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు దాదాపుగా భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా శ్రీరెడ్డి గురించి తెలియని వారుండరు. తెలుగు మీడియా, తమిళ మీడియా ఆఖరికి నేషనల్‌ మీడియా కూడా ఆమెని మ్యాగ్జిమమ్‌ కవర్‌ చేసేశాయి. ఒకే ఒక్క ఆందోళనతో ఆమె దేశం దృష్టిని ఆకర్షించింది. ఆమె ఇంకెవరో కాదు, శ్రీరెడ్డి. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ఈ మధ్య కాలంలో గట్టిగా గళం విప్పిన శ్రీరెడ్డి రాత్రికి రాత్రి స్టార్‌ స్టేటస్‌ సంపాదించేసింది.

న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ ప్రారంభించి సినిమాల్లో చిన్నా చితకా వేషాలు వేస్తూ అలా అలా నెట్టుకొచ్చేసిన శ్రీరెడ్డి ‘కాస్టింగ్‌ కౌచ్‌’ దెబ్బకి చాలా మంది యువతుల జీవితాలు నాశనమైపోతున్నాయనీ వాపోయింది. సినీ పరిశ్రమలో లోటు పాట్లను ఎత్తి చూపుతూ, తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎదుట ధర్నా కూడా చేసింది. ఆ దెబ్బకి తెలుగు సినీ పరిశ్రమ రోడ్డున పడిపోయిందనడం అతిశయోక్తి కాకపోవచ్చు. హీరో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడిచిందనీ, అయితే తనను అభిరామ్‌ వాడుకుని వదిలేశాడనీ, అందుకు తగ్గ ఆధారాల్ని కొన్నింటిని చూపించింది ఆమె.

దర్శకులు శేఖర్‌ మ్ముల, కొరటాల శివ, రచయిత కోన వెంకట్‌.. ఇలా శ్రీరెడ్డి లిస్టులో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. జీవితా – రాజశేఖర్‌లను కూడా వదల్లేదు ఆమె. తమిళ సినీ పరిశ్రమలో లారెన్స్‌, విశాల్‌ తదితరుల పైనా ఆరోపణలు చేసింది. ఎప్పుడయితే పవన్‌ కళ్యాణ్‌ని టార్గెట్‌గా చేసుకుని బూతులతో విరుచుకు పడిందో అక్కడితో శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టేసింది. ఎవరో వెనుక ఉండి, పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి ద్వారా కక్ష్య సాధింపులకు దిగుతున్నారన్న విషయం తేటతేల్లమైపోయింది.

ఆ తర్వాత చెన్నయ్‌కి వెళ్లపోయిన శ్రీరెడ్డి, పవన్‌ కళ్యాణ్‌పై తిట్ల వర్షం కొనసాగిస్తూనే వస్తోంది. అయితే, సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి, శ్రీరెడ్డి పోరాటం ఎట్టకేలకు ఫలితాన్నిచ్చింది. తెలంగాణా ప్రభుత్వం ఓ జీవో ద్వారా లైంగిక వేధింపుల్ని అరికట్టడానికి సంబంధించి, సినీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. నిజంగానే శ్రీరెడ్డికి ఇది చాలా పెద్ద విజయం. ఓ దశలో శ్రీరెడ్డి తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా విమర్శించింది. అయితే, ఇప్పుడు మాత్రం తనను కేసీఆర్‌ గెలిపించారంటూ, తెలంగాణా ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించేస్తోంది. కేసీఆర్‌ రియల్‌ హీరో అంటూ పొగిడేస్తోంది శ్రీరెడ్డి.

ఓ మహిళ ఈ స్థాయిలో పోరాటం చేసి ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడం చిన్న విషయమేమీ కాదు. ఆమె పోరాటానికి మద్దతిచ్చిన మహిళా సంఘాలు కూడా ఒకానొక దశలో ఆమె బూతులకు విసుగు చెంది ఆమెకు దూరంగా జరిగిపోయారు. ఎలాగైతేనేం విజయం దక్కింది. ఇది పూర్తిగా ఆమె విజయమే. మరి సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఆగిపోతాయా.? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...