పవన్ కళ్యాణ్ 28వ చిత్రంకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ విషయమై చాలా రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. కాని ఇప్పటి వరకు సినిమా స్క్రిప్ట్ ఎంత వరకు వచ్చింది షూటింగ్ ఎప్పుడు అనే విషయాలపై హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వలేదు. కాని సినిమా గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ విషయమై మరోసారి మీడియాలో ప్రముఖంగా ఒక వార్త గుప్పుమంటోంది.
పవన్ కళ్యాణ్ కు జోడీగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ను నటింపజేసేందుకు దర్శకుడు హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవలే ఈమె కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి ఆచార్య చిత్రంలో నటించేందుకు కమిట్ అయ్యింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ 28 చిత్రంలో కూడా ఈమె నటించేందుకు కమిట్ అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఆచార్య షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ 28 మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అందుకే డేట్లు క్ల్యాష్ అయ్యే అవకాశం లేదు కనుక ఒకే సారి ఇద్దరు మెగా హీరోలతో నటించేందుకు కాజల్ ఛాన్స్ దక్కించుకుంది. కాజల్ అవకాశాలు లేక ఆమె కెరీర్ ఖతం అయినట్లే అనుకుంటున్న ప్రతి సారి కూడా అనూహ్యంగా ఆఫర్స్ దక్కించుకుని తన స్టార్డంను నిలుపుకుంటూనే ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు ఇండియన్ 2 చిత్రంలో కూడా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే.
779320 245978Hello there, just became alert to your weblog via Google, and discovered that its really informative. Im gonna watch out for brussels. Ill be grateful should you continue this in future. Several folks will probably be benefited from your writing. Cheers! 163443
885877 590349Howdy! I just wish to give a huge thumbs up for the excellent info you may have here on this post. I will probably be coming back to your weblog for a lot more soon. 877864
777768 187900TeenVogue? Searching for fashion advice, celebrity buzz or beauty trends? Find it all in Teen Vogue 601542