వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తోంది.? అధికారులు ఏం చేస్తున్నారు.? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం వుందా.? లేదా.?
‘అన్నీ చేసేస్తున్నాం.. అందర్నీ ఉద్ధరించేస్తున్నాం.. అందుకే, అప్పులు కూడా చేస్తున్నాం.. మేం చేస్తున్న అభివృద్ధి.. మేం చేస్తున్న సంక్షేమం.. ఇవే మాకు వచ్చే ఎన్నికల్లో 175 సీట్లనూ తెచ్చిపెడతాయ్..’ అని వైసీపీ చెబుతోంది.
మరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘జనవాణి’ కార్యక్రమం చేపడితే, పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఫిర్యాదులు ఎందుకు వెళుతున్నాయట.! ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు. పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ.. ఇదీ వైసీపీ పాలన తాలూకు ఘనత.
అధికారంలోకి వచ్చింది మొదలు, ఎలా తమ పార్టీ కార్యకర్తలకు మేలు చేసుకోవాలా.? అన్న కోణంలోనే ఆలోచిస్తోంది వైసీపీ. వైసీపీ కార్యకర్తలు, నాయకులు బాగుపడుతున్నారు. ప్రజల పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారవుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నాయకుల ఆస్తులేంటి.? ఇప్పుడు ఆ నాయకుల ఆస్తులేంటి.? అన్నదానిపై ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకే పూర్తిస్థాయిలో స్పష్టత వుంది.
‘వాలంటీర్లు మా మాట వినడంలేదు..’ అంటాడు ఒకాయన.. ‘మన పార్టీ కార్యకర్తలే వాలంటీర్లు..’ అంటాడు ఇంకొకాయన. ఇలా తయారైంది పరిస్థితి. ఆ వాలంటీర్లలోనూ కొందరు సొంత పార్టీ వేధింపులు తట్టుకోలేక, బయటకు వస్తున్నారు. అలాంటివారూ, జనసేనాని ఈ రోజు చేపట్టిన జనవాణి కార్యక్రమంలో పాల్గొని, తమ ఆవేదనను జనసేన అధినేత ముందుంచారు.
వికలాంగులు (వారిని దివ్యాంగులు అనాలని జనసేనాని సూచించారు), వృద్ధులు.. ఇలా ఒకరేమిటి.? అన్నీ వర్గాల ప్రజలూ వైసీపీ పాలనలో చితికిపోతున్నారని విజయవాడలో జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో బాధితుల్ని చూశాక ఎవరైనా ఇట్టే చెప్పగలుగుతారు.
మరి, వేల కోట్లు, లక్షల కోట్ల సంక్షేమం ఏమైపోతోంది.. ఆ ఒక్కటీ అడక్కూడదంతే.!
మొదటి అర్జీ – తాడేపల్లికి చెందిన మాజీ వాలంటీర్ ఇళ్లు కూల్చేసి, ఆ ఇంటి బిడ్డని చంపేసి పోస్ట్ మార్టం కూడా నిర్వహించని వైనం.
జనసేన దీనిని వ్యక్తిగతంగా తీసుకుంటుంది.. #JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/EkTt5DuStG
— JanaSena Party (@JanaSenaParty) July 3, 2022