పాపం రాజుగారు.. పదవి ఊడగొట్టుకున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తొలగింపబడ్డారు. ఇప్పటిదాకా ఆయన సబార్డినేట్ లెజిస్లేటచర్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా వున్నారు. ఇప్పుడు ఆయన ప్లేస్‌లోకి వైసీపీ ఎంపీ బాలశౌరిని నియమిస్తూ ప్రకటన వెలువడింది.
ఆయన్ను స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ వైసీపీ ఎంపీల బృందం ఇటీవల లోక్‌సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్నది నర్సాపురం ఎంపీపై వున్న అభియోగం. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు, గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి కొరకరాని కొయ్యిలా మారారు.
దాదాపుగా ప్రతిరోజూ దేశ రాజధాని ఢిల్లీలో రచ్చబండ నిర్వహిస్తున్నారు.. వైసీపీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వాన్ని తూలనాడుతున్నారు. ‘నన్ను ఎవడూ ఏమీ చేయలేడు..’ అంటూ విర్రవీగుతూ వచ్చారు రఘురామకృష్ణరాజు. ఇప్పుడేమో ‘కీలకమైన పదవి’ ఊడిపోయిందాయె.!‘రాజకీయాల్లో గోకడం సహజం.. మరీ, ఇంతలా గోకేస్తే తేడా వచ్చేస్తుంది..’ అంటూ రాజుగారి మీద సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
ఇదిలా వుంటే, ఇటీవల రఘురామకృష్ణరాజుకి చెందిన కంపెనీలపై సీబీఐ సోదాలు జరిగాయి. దాదాపు 800 కోట్ల ఎగవేతకు పాల్పడ్డారన్నది ఆయనకు సంబంధించిన కంపెనీల మీద సీబీఐ నమోదు చేసిన కేసు సారాంశం. ఈ నేపథ్యంలోనే ఆయన ‘తొలగింపు’ జరిగిందన్నది వైసీపీ వాదన. మరి, ఈ వ్యవహారంపై రఘురామకృష్ణరాజు ‘రచ్చబండ’ నిర్వహిస్తారా.? నిర్వహిస్తే ఆయన వాదన ఎలా వుండబోతోంది.? ‘నన్నెవరూ ఏమీ పీకలేరు..’ అని ఇప్పటిదాకా పలు సందర్భాల్లో ధీమా వ్యక్తం చేసిన రాజుగారికి, ఢిల్లీ స్థాయిలో ‘ఇమేజ్’ పడిపోయిందనే భావించాలేమో.!
కేవలం స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి మాత్రమేనా.? ముందు ముందు ఎంపీ పదవి కూడా ఆయనకు దూరమవుతుందా.? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏమైపోయాయ్ రాజుగారికి బీజేపీ పెద్దలతో పరిచయాలు.? కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు.? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.
740586 779822hi this post assist me full . .should you want watches males pay a visit to my web sites is extremely help you for males watches. .thank man excellent job. 165208
482368 966110An intriguing discussion is worth comment. I believe which you ought to write regarding this subject, it may possibly not be a taboo topic but typically persons are too couple of to chat on such topics. To yet another location. Cheers 215621
790014 160765Hiya! awesome blog! I happen to be a every day visitor to your web site (somewhat much more like addict ) of this web site. Just wanted to say I appreciate your blogs and am seeking forward for a lot more to come! 325486
594729 982583Thank you pertaining to giving this excellent content material on your web-site. I discovered it on google. I might check back once more should you publish extra aricles. 155669