Switch to English

రైతు భరోసా.. జనసేన డిమాండ్‌ ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

చంద్రబాబు హయాంలో ఏ సంక్షేమ పథకం తెరపైకొచ్చినా, అందులో లోటు పాట్లను అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్సీపీ వెతకడం.. వెతికి యాగీ చేయడం చూశాం. రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలే. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు ‘కొర్రీలు’ పెడుతూ సంక్షేమ పథకాల్ని సరికొత్తగా తెరపైకి తెస్తోంది.

నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించేవారికి.. ఈ కొర్రీలు పెద్దగా కన్పించవు. కానీ, ఎన్నికల్లో హామీ ఇచ్చాక దాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని చెబుతూ.. పార్టీ మేనిఫెస్టోని బైబిల్‌గా చెప్పుకుంటున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాట తప్పితే ఎలా.? ఇదే విషయాన్ని జనసేన పార్టీ కూడా ప్రశ్నిస్తోంది. రైతులకు 12,500 రూపాయలు పెట్టుబడి సాయాన్ని రైతు భరోసాగా అందిస్తామని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారు.. మేనిఫెస్టోలోనూ ప్రస్తావించారు.

మరోపక్క కేంద్రం, రైతులకి 6 వేల రూపాయలు పెట్టుబడి సాయాన్ని గతంలోనే ప్రకటించింది. ఆ లెక్కన మొత్తం 18,500 రూపాయలు ఒక్కో రైతుకీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలి. కానీ, 13,500 రూపాయలతో సరిపెట్టేస్తోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. రైతుకి ఏ కాస్త సాయం ప్రభుత్వం నుంచి అందినా అది గొప్ప విషయంగా మారిపోయింది. వాస్తవమేంటంటే.. రైతుకి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇచ్చినా అది తక్కువే. రైతు అవసరాలు అలాంటివి.

కానీ, గ్రామ వాలంటీర్ల పేరుతో పార్టీ కార్యకర్తలకు నెలకు 5 వేల రూపాయలు సమర్పించుకుంటున్న జగన్‌ సర్కార్‌, రైతుకి మాత్రం ఏడాదికి 13,500 రూపాయలు.. అంటే నెలకి వెయ్యి రూపాయలకు కాస్త అటూ ఇటూగా మాత్రమే అందిస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? గ్రామ వాలంటీర్లు అధికార పార్టీ కోసం పనిచేస్తారు.. రైతులు అలా పని చేయాలన్న రూల్‌ లేదు కదా.. అదీ అసలు సంగతి.. అనుకోవాలేమో.

ఇక, 86 లక్షల మందికి అందాల్సిన రైతు భరోసాని సగం మందికే ఎలా పరిమితం చేస్తారని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది. రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని మూడు విడతలుగా కాకుండా, రెండు విడతల్లోనే ఇవ్వాలన్నది జనసేన తెరపైకి తెచ్చిన మరో డిమాండ్‌. మరి, జనసేన డిమాండ్లపై అధికార పక్షం ఏమంటుందో వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...