ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వైపు పరిపాలన పరమైన వ్యవహారాలతో బిజీగా ఉండటంతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పార్టీ వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. తాజాగా వైకాపా అధికారిక ట్విట్టర్ ఖాతాలో… ‘రేపటి నుంచి పార్టీ కార్యకర్తలతో సీఎం వైయస్ జగన్ భేటీ.. తొలుత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కానున్న సీఎం. – కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం’ అంటూ ట్వీట్ చేయడం జరిగింది.
ఇంత అర్జంట్ గా కార్యకర్తల సమావేశంకు కారణం ఏమై ఉంటుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ కార్యకర్తల మీటింగ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంతకు పార్టీ కార్యకర్తలతో మరియు నాయకులతో జగన్ చర్చించబోతున్న అంశాలు ఏంటీ.. రహస్య ఎజెండా ఏంటీ అనేది చూడాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు నియోజక వర్గం కుప్పంనే మొదట ఎంపిక చేసుకోవడం కాస్త ఆలోచించాల్సిన విషయం.